Dil Raju Wife: 'దిల్' రాజు వైఫ్ తేజస్వినిలో సడన్ ఛేంజ్... ఉన్నట్టుండి ఎందుకిలా?
Dil Raju Wife Tejaswini: 'దిల్' రాజు భార్య తేజస్విని కొత్త అలవాటు, ఉన్నట్టుండి ఆమెలో వచ్చిన మార్పు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సినిమాలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ప్రేక్షకులకూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న ప్రొడ్యూసర్లు కొందరు ఉన్నారు. అయితే... నిర్మాతల భార్యల గురించి ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ. అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్ నుంచి మొదలు పెడితే... యంగ్ ప్రొడ్యూసర్లలో సూర్యదేవర నాగ వంశీ, బన్నీ వాసు వరకు... నిర్మాతలు చాలా మంది ఉన్నారు. వాళ్ల భార్యలు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. మీడియా ముందుకు రావడం లేదు. బట్ ఫర్ ఏ చేంజ్... దిల్ రాజు భార్య ఇటీవల యాక్టివ్ అయ్యారు.
తేజస్విని వ్యాఘలో మార్పు... ఎందుకిలా!?
'దిల్' రాజు మొదటి భార్య అనిత పేరు ప్రతి సినిమా పోస్టర్ మీద ఉండేది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో నిర్మించే ప్రతి సినిమాకు ఆవిడ సమర్పకురాలిగా వ్యవహరించేవారు. ఆవిడ మరణించిన తర్వాత కూడా కొన్ని సినిమా పోస్టర్ల మీద 'శ్రీమతి అనిత సమర్పించు' అని పడింది. ఇప్పుడు 'దిల్' రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద సినిమాలు వస్తున్నాయి. అయితే అనిత ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. కానీ ఇప్పుడు తేజస్విని మీడియా అటెన్షన్ కోరుకుంటున్నట్లు కనబడుతోంది.
View this post on Instagram
సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్)లో దిల్ రాజు రెండో భార్య తేజస్వినికి అకౌంటు ఉంది. అందులో ఆవిడ అప్పుడప్పుడు పోస్టులు చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఎక్కువగా భర్త దిల్ రాజు, తనయుడు అన్వి రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆవిడ పర్సనల్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అలాగే భర్తతో కలిసి ఫారిన్ వెకేషన్ వెళ్ళినప్పుడు సైతం అక్కడ తీసుకున్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు. గతేడాది ఇంత ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టులు చేయలేదు. ఇటీవల ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
తేజస్విని చేతిలో లార్విన్ ఏఐ స్టూడియో!
లార్విన్ ఏఐ స్టూడియో లాంచ్ జరిగినప్పుడు భర్త 'దిల్' రాజుతో కలిసి తేజస్విని సందడి చేశారు. అంతే కాదు... ఫిల్మ్ మేకింగ్ పరంగా ఏఐ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది ఇండస్ట్రీ ప్రముఖులకు వివరించిన వీడియోస్ కూడా షేర్ చేశారు తేజస్విని. ఆ స్టూడియోలో ఆవిడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ
లార్విన్ ఏఐ స్టూడియో బాధ్యతలను తన భార్య తేజస్విని చేతిలో పెట్టారు 'దిల్' రాజు. ఒక వైపు ఆ పనులు చూసుకుంటూ... మరొక వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యారు ఆవిడ. ప్రేక్షకులకు అప్డేట్స్ చేరువ కావడంలో సోషల్ మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది గమనించిన తేజస్విని... ఇప్పటి నుంచి యాక్టివ్ అయ్యారు అనేది 'దిల్' రాజు కాంపౌండ్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. లార్విన్ ఏఐ ఆలోచన తన భర్త 'దిల్' రాజు గారిదని, తనను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న భర్తకు థాంక్స్ అని ఆ స్టూడియో లాంచ్‌లో చెప్పారు. అదన్నమాట సంగతి.





















