SSMB29 Funny Memes: రాజమౌళి పోస్ట్, మహేష్ రిప్లై - పుట్టుకొచ్చిన మీమ్స్.. ఇవి చూస్తే నవ్వకుండ ఉండలేరు
Funny Memes on SSMB29: ఎస్‌ఎస్‌ఎంబీ29 షూటింగ్‌పై డైరెక్టర్ రాజమౌళి చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. వేలల్లో మీమ్స్ పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.

Memes Spark After Rajamouli Post: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో దీనిని ప్రకటించారు. పాన్ వరల్డ్‌గా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందనుంది. అమెజాన్ అడవుల్లో యాక్షన్ అడ్వేంచర్‌గా సాగే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల పూజ కార్యక్రమంతో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. దీనిపై ఆఫీషియల్ ప్రకటన లేదు. కానీ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఇక రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి జక్కన్న సాలీడ్ అప్‌డేట్ ఇచ్చాడు.
రెండు రోజులు క్రితం ఓ వీడియో షేర్ చేస్తూ ఇన్‌డైరెక్టర్‌గా SSMB29పై కీలక అప్‌డేట్ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సింహాన్ని లాక్ చేసిన వీడియో షేర్ చేశారు. దానికి ముందు రాజమౌళి, మహేష్ బాబు పాస్‌పార్ట్ సీజ్ చేసినట్టు నవ్వుతూ లుక్ ఇచ్చారు. దీనికి బ్యాగ్రౌండ్‌లో స్పైడర్ మూవీలోని ఎస్‌జే సూర్య సైకో బీజీఎం జత చేశాడు. గత శుక్రవారం రాత్రి ఈ పోస్ట్ చేయగా.. తెల్లేరేసరికి సోషల్ మీడియాతో మొత్తం SSMB29 మీమ్స్‌తో నింపేశారు. రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో పరిస్థితి ఏలా ఉంటుందో చెబుతూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు. దీంతో నెక్ట్స్ డే వీటిపై వేలల్లో మీమ్స్ పుట్టుకొచ్చాయి. దీంతో కొన్ని రోజులు SSMb29 మూవీ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
కాగా రాజమౌళితో సినిమా అంటే ఇక ఆ హీరోకి, మూవీ టీంకి ఇక వేరే కమిట్‌మెంట్ ఏం ఉండకూడదు. ఇండస్ట్రీలో జక్కన్నకు పని రాక్షసుడి అనే పేరు ఉంది. ప్రతి చిన్న సీన్ ఆయనకు ప్రత్యేకమే. ఎలాంటి పొరపాటు లేకుండ జాగ్రత్త పడతారు. మూవీ లేట్ అయిన మంచిదే కానీ అవుట్ మాత్రం వందశాతం పర్ఫెక్ట్ ఉండేలంటారు. అందుకు జక్కన్న సినిమా అంటే రెండు మూడేళ్లు ఆ హీరో లాక్ అయిపోయినట్టు. ఇది పూర్తయ్యే వరకు వేరు కొత్త ప్రాజెక్ట్ ఏది కమిట్ అవ్వడానికి వీలు ఉండదు. ఇటు వైపు మహేష్ ఫుల్ ఫ్యామిలీ మ్యాన్. కాస్తా విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లిపోతారు. షెడ్యూల్‌కి షెడ్యూల్ విరామం తీసుకుని కుటుంబంతో విదేశాల్లో వాలిపోతారు. అలాంటి మహేష్ బాబు ఈ సారి రాజమౌళి చేతికి చిక్కారు. దీంతో మూడేళ్ల పాటు పాస్‌పోర్టు ఇవ్వకండి సార్ కొందరు.
మరికొందరు ఏమో పలు సినిమాల్లోని కామెడీ సీన్స్, సీరియస్ సీన్స్‌కి రాజమౌళి, మహేష్ బాబులను కంపేర్ చేస్తూ మీమ్స్, ఫన్నీ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవన్న నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. నకిలి పాస్‌పోర్టు ఎక్కడ దొరుకుందని మహేష్ గూగుల్లో వేతికేస్తున్న మీమ్స్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక జులాయి సినిమాలో బస్‌స్టాప్ వద్ద బ్రహ్మనందం, ఆలీ మధ్య వచ్చే దొంగతనం సీన్‌కి కూడా వాడేసారు మీమర్స్. మహేష్ తన పాస్‌పోర్టు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే జక్కన్న ఎలా పట్టేసాడు అనేది ఈ వీడియోతో మీమ్ చేశారు. ఇలా SSMB29పై రకరకాలుగా వీడియోలు మీమ్స్ చేస్తూ తమదైన స్టైల్లో ఫన్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా జక్కన్న పోస్ట్ కి మహేష్ బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ తో కామెంట్స్ చేశాడు. ఇక ప్రియాంక చోప్రా ఫైనల్లీ అంటూ రెస్పాండ్ అవ్వడంతో ఆమె ఈ సినిమాలో హీరోయిన్ స్పష్టమైంది.
Chilipi BOB 🌚#SSMB29 #MaheshBabu pic.twitter.com/jH1vsTHt8U
— . (@Butcher_4005) January 24, 2025
Sithara: Daddy New York Trip Ki Veldham
— Avinash™ (@NameisAvinashJ) January 24, 2025
Babu : Passport Lageskunnad Amma 🥲 pic.twitter.com/PGAtmDaZwu
Orey 🤣😂🤣#SSMBxSSRGloryHunt#SSMB29#PriyankaChopra #MaheshBabu #SSRajamouli #Globetrottering@urstrulyMahesh@priyankachopra pic.twitter.com/prhKSV6JiF
— #SSMB29🦁 (@Manheshtrends12) January 25, 2025
They casually recreated this scene!🤣😂@urstrulyMahesh @ssrajamouli #SSMB29 pic.twitter.com/ji1sOKTnDh
— . (@Sudheerholicc1) January 24, 2025





















