Srikanth Iyengar: జాతిపితను అదేపనిగా దూషిస్తున్న శ్రీకాంత్ అయ్యంగార్ - స్పెషల్ ట్రీట్‌మెంట్ కోసమేనా ?
Actor Srikanth Bharat: సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ జాతిపితపై పదే పదే అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Srikanth Iyengar insult Mahatma Gandhi: భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో అహింసా మార్గంతో దేశాన్ని విదేశీ వారి అణచివేత నుంచి విముక్తి చేసిన మహాత్మా గాంధీపై అనుచితమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్. తనకు కులం లేదని ఇటీవల ఆయన తన పేరును శ్రీకాంత్ భారత్ గా మార్చుకున్నారు. దేశం అంటే ప్రేమతో తన పేరులో భారత్ అని చేర్చుకున్నానన్నారు. అయితే ఇప్పుడు ఆయన జాతిపిత మహాత్మగాంధీని లక్ష్యంగా చేసుకుని ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
శ్రీకాంత్ భారత్ గాంధీ జయంతి రోజు ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో 'మహాత్మా గాంధీ మహాత్ముడా? జాతిపితా?' అంటూ ప్రశ్నించి, రాయడానికి వీల్లేని బూతుపదాలతో దూషించాడు. "గాంధీజీ స్త్రీలోలుడు.. ఎంతో మంది అమ్మాయిలు, యువతలను లైంగికంగా వేధించాడు" అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. మరో వీడియోలో "గాంధీజీ జాతిపిత అయితే తాను సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ " అని అనుచితంగా చెప్పాడు. "ధైర్యం ఉంటే ఈ వీడియో చూడండి.. ఇది నిజం" అంటూ సవాలు విసిరాడు.
మహాత్మా గాంధీపై నోరు పారేసుకున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 7, 2025
భారత్‌కు స్వాతంత్ర్యం తెప్పించిన మన జాతిపిత గాంధీపై అవగాహన లేని మాటలు
గతంలో ఓ సందర్భంలో శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు నెట్టింట్లో మళ్లీ వైరల్
నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోవడంతో.. ఆయనపై విమర్శలు గుప్పించిన… pic.twitter.com/CEkdrMN5gO
ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది. ఆయనపై విమర్శలు వచ్చాయి. దాంతో తాజాగా మరో వీడియో విడుదల చేశారు. స్వాతంత్ర్యం గాంధీ వల్ల రాలేదని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి యోధుల పోరాటాల వల్లే వచ్చిందని, వారిని పరమాత్ములుగా పిలిచారు. గాంధీని అవమానించారు.
Dare to WATCH?!?!?!
— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025
THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP
గాంధీయ వాదులు, సామాన్యులు పోలీసులను ట్యాగ్ చేసి చర్యలు తీసుకోమని కోరారు. కొందరు అతని చరిత్ర అవగాహన లేకపోవడాన్ని, మానసిక సమస్యలు ఉన్నాయని విమర్శించారు. వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుంటే ఇలాగే మదం ఎక్కుతుంది. గాంధీ జాతిపిత అని సుభాష్ చంద్రబోస్ కూడా చెప్పారని కొంతమంది గుర్తుచేశారు.
తన బలమే కాదు.. బలహీనతలు కూడా తెలిసిన వాడు గాంధీ. వాటిని.. ఆ బలహీనతల నుంచి బయట పడేందుకు తను చేసిన ప్రయత్నాలను నిస్సంకోచంగా తన ఆత్మకథలో రాసుకోగలిగారంటే.. ఎంత ధైర్యముండాలి. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. అలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఇక పుట్టబోడు. పదవులు కోరని పావనమూర్తి రా ఆయన
— sujay kumar Nidiginti (@SNidiginti8999) October 7, 2025
విమర్శలు ఎక్కువైన తర్వాత శ్రీకాంత్ మరో వీడియో షేర్ చేశాడు. అందులో తనపై వచ్చిన కామెంట్లను పట్టించుకోవని, కానీ గాంధీపై చెప్పినది 'నిజం' అని సమర్థించుకున్నాడు. జాతిపితను ఇష్టం వచ్చినట్లుగా విమర్శిస్తున్న శ్రీకాంత్ భారత్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.





















