అన్వేషించండి

Ustaad Movie Teaser: ఎత్తులంటే భయపడే యువకుడు పైలెట్‌గా మారితే? ‘ఉస్తాద్’ టీజర్ అదుర్స్!

శ్రీ సింహా, కావ్య కల్యాణ్ రామ్ నటించిన తాజాగా చిత్రం ‘ఉస్తాద్’. ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. పాత బైక్ నడిపే యువకుడు ఎలా పైలెట్ గా మారాడో ఇందులో చూపించారు.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు శ్రీ సింహ కోడూరి. ‘యమదొంగ’, ‘మర్యాద రామన్న’ చిత్రాల్లో బాల నటుడిగా కనిపించాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ లాంటి సినిమాలు చేసినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్’.  సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ కలిసి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫణిదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్స్పిరేషనల్‌,  క్యూట్ లవ్ స్టోరీ మూవీలో ‘బలగం’ బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.  

ఆకట్టుకుంటున్న ‘ఉస్తాద్’ టీజర్

ఈ సినిమా టీజర్, ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సింహా కోడూరి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మొదట్లో ఎత్తు నుంచి కిందకి చూడాలంటే భయపడే కుర్రాడిగా శ్రీ సింహా కనిపిస్తాడు. అనంతరం తనకున్న ఫోబియాను వదిలి పెట్టడంతో పాటు పైలెట్ గా మారుతాడు. ఈ టీజర్ లో హీరోగా శ్రీ సింహా చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత బైక్ ను రిపేర్ చేయించి నడుపుతాడు. తండ్రి కోప్పడినా వేగంగా వెళ్లే వాహనాలతో పోటీపడి మరీ దూసుకెళ్తాడు. బైక్ నడిపే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని ఎలా తట్టుకోవాలో నేర్చుకున్న మెళకులు పైలెట్ గా మారిన తర్వాత కూడా అతడికి ఎలా ఉపయోగపడతాయో టీజర్ లో చూపించారు. మొత్తంగా ఓ సాధారణ యువకుడు పైలెట్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ టీజర్ లో చూపిచారు. కావ్య కల్యాణ్ రామ్ మరోసారి తన నేచురల్ నటనతో ఆకట్టుకుంది.  

ఇక ఈ చిత్రానికి అదరిపోయే సినిమాటోగ్రఫీ అందించారు పవన్ కుమార్ పప్పుల. ఆయన కెమెరా పనితీరు టీజర్ లో అద్భుతంగా కనిపించింది.  అకీవ బీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. యువకులకు బాగా నచ్చిన RX 100 బైక్ ని ఈ సినిమాలో ‘ఉస్తాద్’ పేరుతో హీరో నడపటం ఆకట్టుకుంది. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.  ఈ సినిమాతో నైనా  శ్రీసింహ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

త్వరలో విడుదల తేదీ వెల్లడి!

అటు ఈ టీజర్‌ను ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ షేర్ చేశాడు. టీజర్ చాలా బాగుందని ట్వీట్ చేశారు. శ్రీ సింహకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అటు ఈ సినిమా బృందానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. వారాహి బ్యానర్‌లో బ్యానర్‌లో ‘ఉస్తాద్’ సినిమా రూపొందుతోంది. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

Read Also: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?
అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?
అల్లు అర్జన్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటీ?
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Meenu Song Promo : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Bomb threats to RBI: ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
Embed widget