News
News
వీడియోలు ఆటలు
X

Kabzaa OTT Release: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

ఉపేంద్ర నటించిన పాన్ ఇండియా మూవీ 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించగా, కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.

FOLLOW US: 
Share:

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించారు.  కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషించారు. అగ్ర హీరోలు ఉపేంద్ర - సుదీప్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా అభిమానులను బాగానే అలరించింది. దివంగత నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా మార్చి 17న ఈ చిత్రాన్ని విడుదల చేశారు.  కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

View this post on Instagram
 
A post shared by R.Chandru (@rchandrumovies)

ఓటీటీలో విడుదలకు రెడీ అయిన 'కబ్జా'

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందుకోసం ఫ్యాన్సి అమౌంట్ ను చెల్లించినట్లు తెలుస్తోంది. కన్నడ యాక్షన్ డ్రామా ‘కబ్జా’ గ్లోబల్ స్ట్రీమింగ్ ప్రీమియర్‌ను ప్రకటించింది. భారత్ తో పాటు  ప్రపంచ వ్యాప్తంగా  ఏప్రిల్ 14 నుంచి కన్నడలో తమిళం, తెలుగు, మలయాళం, హిందీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు వెల్లడించింది.   

View this post on Instagram
 
A post shared by prime video IN (@primevideoin)

'కబ్జా' మూవీ కథేంటంటే?

ఇక ఈ సినిమా కథ 1942లో మొదలవుతుంది. బ్రిటీష్ పాలనలో ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన ఉపేంద్ర, అనివార్య పరిస్థితుల కారణంగా అండర్ వరల్డ్ లోకి ఎలా ప్రవేశించాడు? ఆ తరువాత అండర్ వరల్డ్ ని శాసించే డాన్ గా ఎలా ఎదిగాడు? అండర్ వరల్డ్ ని రూపుమాపడానికి వచ్చిన పోలీసు అధికారి సుదీప్, ఇతర శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథాశంతో 'కబ్జా' సినిమాను తెరకెక్కించారు. అండర్ వరల్డ్ డాన్ గా ఉపేంద్ర, పోలీస్ గా సుదీప్ ఆకట్టుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా కనిపించారు. కన్నడ సీనియర్ హీరో శివన్న ఈ చిత్రంలో స్పెషల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

కీలక పాత్రల్లో ఆకట్టుకున్న ప్రముఖ నటీనటులు

ఈ చిత్రంలో శ్రియా శరణ్ తో పాటుగా మురళీ శర్మ, కోట శ్రీనివాస్, పోసాని కృష్ణ మురళి, సుధ, కబీర్ దుహన్ సింగ్, నవాబ్ షా, దేవ్ గిల్ తదితరులు నటించారు. 'కబ్జా' చిత్రాన్ని శ్రీ సిద్దేశ్వర ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ సినిమాస్ బ్యానర్స్ పై ఆర్. చంద్రు భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలంకార్ పాండియన్, ఆర్కా సాయి కృష్ణ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బసృర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.  

Published at : 12 Apr 2023 10:34 AM (IST) Tags: Shriya Saran Upendra Kabzaa R.Chandru Kichcha Sudeepa Prime Video India

సంబంధిత కథనాలు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Sharwanand Marriage : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!