అన్వేషించండి

'ఆదికేశవ' నుంచి శ్రీలీల బర్త్ డే గ్లిమ్స్ అదిరిందిగా!

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆదికేశవ'. ఈరోజు శ్రీ లీల బర్త్ డే సందర్భంగా మూవీ యూనిట్ ఓ సర్ ప్రైజ్ వీడియోని విడుదల చేసింది.

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆదికేశవ'. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ గ్లిమ్స్ వీడియో విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే తాజాగా ఈరోజు హీరోయిన్ శ్రీ లీలా బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ సర్ ప్రైజ్ వీడియోని రిలీజ్ చేశారు. శ్రీ లీల బర్త్ డే గ్లిమ్స్ పేరుతో విడుదలైన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుందనే చెప్పాలి. ముఖ్యంగా గ్లిమ్స్ వీడియోలో శ్రీలీలా ఎల్లో సారిలో అందంగా నడుచుకుంటూ వస్తున్న షాట్ అదిరిపోయింది. ఇక ఇందులో వైష్ణవ్, శ్రీ లీల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుందనే చెప్పాలి. ఈ ఇద్దరి పెయిర్ ఆన్ స్క్రీన్ పై చూడముచ్చటగా ఉంది. ఇక వీడియో చివర్లో వైష్ణవ్ తేజ్ శ్రీలీల కి హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేస్తూ మేకర్స్ వీడియో డిజైన్ చేయండం శ్రీ లీలా బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇక ఈ వీడియోలో జీవి ప్రకాష్ బీజీయం కూడా చాలా బాగుంది.

దీంతో ప్రస్తుతం ఈ గ్లిమ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో భోజు జార్జ్ విలన్ గా కనిపించనుండగా.. మరో మలయాళ నటి అపర్ణ దాస్ కీలక పాత్ర పోషిస్తుంది. జూలైలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక వైష్ణవ తేజ్ కెరియర్ లో నాలుగవ సినిమాగా 'ఆదికేశవ' తెరకెక్కుతోంది. 'ఉప్పెన' సినిమాతో వెండితెరకు హీరోగా ఆరంగేట్రం చేసిన వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నటించిన 'కొండ పొలం', 'రంగ రంగ వైభవంగా' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి.

దీంతో ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన వైష్ణవ తేజ్ 'ఆదికేశవ' సినిమాల్ల్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇటీవల టీజర్ ని బట్టి చూస్తే ఆదికేశవ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక సినిమాలో వైష్ణవ తేజ్ మేకోవర్ కూడా కొత్తగా ఉండటం, శ్రీ లీల లాంటి టాలెంటెడ్ హీరోయిన్ నటించడం తో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టబోతున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ముందు సినిమా నుంచి ఒక్కో పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ ఈ సినిమాకి అద్భుతమైన ట్యూన్స్ అందించినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా 'సార్' సినిమాకి అదిరిపోయే సాంగ్స్ ని కంపోజ్ చేసిన జీవి ప్రకాష్, ఇప్పుడు తెలుగులో 'ఆదికేశవ' సినిమాతో పాటు నితిన్ - వెంకీ కుడుముల ప్రాజెక్టుకి సంగీతమందిస్తున్నాడు. వీటిలో 'ఆదికేశవ' సాంగ్స్ ముందుగా విడుదల కానున్నాయి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget