Sree Vishnu Hospitalized: యువ హీరో శ్రీ విష్ణుకు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స
యువ కథానాయకుడు శ్రీ విష్ణు ఆసుపత్రి పాలయ్యారు.
యువ కథానాయకుడు శ్రీ విష్ణు (Sree Vishnu) ఆసుపత్రిలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు డెంగ్యూ వచ్చిందని తెలిసింది. తొలుత ఇంటి నుంచి చికిత్స తీసుకున్నప్పటికీ... ప్లేట్‌లెట్స్ దారుణంగా పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, దాంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చెరిపించినట్టు తెలుస్తోంది.
అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో శ్రీ విష్ణుకు చికిత్స అందుతోంది. త్వరలో ఆయన డిశ్చార్జి కావచ్చు. శ్రీ విష్ణు ఆసుపత్రిలో ఉండటంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కాస్త ఆందోళనలో ఉన్నారు.
Also Read : ఒంటి మీద నూలు పోగు లేకుండా - బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోజులు
సినిమాలకు వస్తే... పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్న చిత్రం 'అల్లూరి'. నిజాయతీకి మారుపేరు అనేది ఉపశీర్షిక, అల్లూరి సీతారామరాజు జయంతికి టీజర్ ఇటీవల విడుదల చేశారు. మంచి తేదీ చూసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
View this post on Instagram