అన్వేషించండి

Nikhil Spy Movie: చిక్కుల్లో 'స్పై' మూవీ - నిర్మాతతో హీరో నిఖిల్ గొడవ?

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్పై' మూవీ జూన్ 29న విడుదల కానుండగా.. అంతలోనే ఈ సినిమాకు ఓ ఊహించని సమస్య తలెత్తింది.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు మీడియం రేంజ్ హీరో కాదు. పాన్ ఇండియా హీరో. 'కార్తికేయ 2' సినిమాతో నిఖిల్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దాంతో నిఖిల్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి ఇప్పుడు. ఆ అంచనాలకు తగ్గట్టే నిఖిల్ కూడా డిఫరెంట్ సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. అలా నిఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం 'స్పై'(SPY). ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ సూపర్ రెస్పాన్స్ ని కనబరిచింది. ఈ నెలాఖరికి రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇంతలోనే ఈ మూవీకి ఊహించని సమస్య వచ్చి పడింది. తాజాగా 'స్పై' మూవీ నిర్మాత - హీరో నిఖిల్ మధ్య మూవీ రిలీజ్ పై అసలు సమస్య తలెత్తింది. ఈ నెలాఖరికి సినిమా రిలీజ్ వద్దని అంటున్నాడు నిఖిల్. ఎందుకంటే ప్రమోషన్ కు టైం సరిపోదు. కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందనేది నిఖిల్ వాదన.

అటు నిర్మాత ఈక్వేషన్స్ మరో విధంగా ఉన్నాయి. అదేంటంటే ఈ సినిమాను ఇంతకుముందు ప్రకటించిన తేదీకి కచ్చితంగా రిలీజ్ చేయాలి. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ మొత్తానికి దక్కించుకుంది. ఒకవేళ సినిమా విడుదల కనుక ఇప్పుడు వాయిదా పడితే అమెజాన్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది. అందుకే విడుదల తేదీని వాయిదా వేయడానికి నిర్మాత ఏమాత్రం ఇష్టపడడం లేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ ని కూడా విడుదల చేశారు. జూన్ 29న థియేటర్స్లోకి వస్తున్నామంటూ ఆ సాంగ్లో మరోసారి ప్రకటించారు. కానీ సాంగ్ రిలీజ్ వ్యవహారానికి సంబంధించి నిఖిల్ దూరంగా ఉన్నాడు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. దీంతో నిర్మాత మాత్రం జూన్ 29న సినిమా విడుదల చేయాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇలా ఆఖరి నిమిషాల్లో నిఖిల్ నిర్మాతలకు తలనొప్పులు తెచ్చి పెడతాడని అతనిపై ఎప్పటినుంచో ఓ టాక్ ఉంది. సినిమా బిజినెస్ గురించి కానీ, నిర్మాతల గురించి కానీ ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం తన సొంత ప్రయోజనాల కోసం ప్రాధాన్యత ఇస్తాడంటూ నిఖిల్ పై గతంలో అనేక రకాల కథనాలు వచ్చాయి.

ఇక ఇప్పుడు మరోసారి స్పై మూవీ నిర్మాత నిఖిల్ మధ్య సినిమా విడుదల సమస్య తలెత్తడంతో ఈ ఇష్యూ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పటికే విడుదలైన 'స్పై' టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. కానీ తాజాగా నిఖిల్ వ్యవహార శైలితో రిలీజ్ కు ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయనేది స్పై మూవీ నిర్మాత వాదన. ప్రస్తుతానికైతే షెడ్యూల్ ప్రకారమే విడుదలకు వెళ్లాలని నిర్మాత ఆలోచిస్తున్నారట. అయితే హీరో సహకారం లేకుండా డబ్బింగ్ పనులు పూర్తి కాకుండా ఇది సాధ్యపడదు. మరి ఈ విషయంలో నిఖిల్ ఏం చేస్తాడో చూడాలి. అయితే, పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న నిఖిల్‌పై కావాలనే బురద చల్లే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందుకే, ఇలాంటి వార్తలను పుట్టిస్తున్నారని పలువురు అంటున్నారు. ఇలాంటి పుకార్ల ద్వారా నిఖిల్ అవసకాశాలకు గండికొట్టాలని చూస్తున్నారనే టాక్ నడుస్తోంది.

కాగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తుండగా.. గ్యారీ బిహెచ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమాలో నిఖిల్ ఓ స్పై గా కనిపించనున్నాడు. ఇక అతని సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్, మకరంద్ పాండే తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Chennai Love Story Collections : చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!
చెన్నై లవ్ స్టోరీ రికార్డ్ ప్రీమియర్ కలెక్షన్స్ - కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ కొట్టేశారుగా!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget