Saripodhaa Sanivaaram: నాని 'సరిపోదా శనివారం' నుంచి సర్‌ప్రైజ్ - టీజర్ కానీ టీజర్ విడుదల, ఈ వీడియో ప్రత్యేకత ఎంటంటే
Saripodhaa Sanivaaram Not a Teaser: నాని సరిపోదా శనివారం స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఎస్ జే సూర్య సందర్భంగా టీజర్ కానీ టీజర్ అంటూ చిన్న వీడియో విడుదల చేసి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
SJ Surya Birthday Surprise From Saripodhaa Sanivaaram: హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. ఈ సినిమా తాజాగా ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమా తమిళ నటుడు, డైరెక్టర్ ఎస్.జే సూర్య నెగిటివ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ఓ పోలీసు ఆఫీసర్‌గా కనిపంచబోతున్నారు. ఇవాళ(జూలై 20) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన బర్త్‌డే విషెస్ తెలుపుతూ మూవీ టీం ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. టీజర్ కానీ టీజర్ అంటూ ఎస్‌జే సూర్యకు సంబంధించిన స్పెషల్ వీడియో వదిలారు.
ఇందులో ఎస్‌జే సూర్యను నరకాసురుడితో పోలుస్తూ హిందీ భాషలో నాని డబ్బింగ్‌తో వీడియో మొదలైంది. పురాణకాలంలో నరకాసురుడి పేరుతో ఓ రాక్షసుు ఉండేవాడు. వాడు ప్రజలకు హింసిస్తుండేవాడు. దీంతో శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అతడిని సంహరించడానికి వచ్చాడు అని చెబుతూ హిందీలో నాని వాయిస్‌తో ఈ వీడియో సాగింది. అంతేకాదు చివరిలో హ్యాపీ బర్త్‌డే సర్ అంటూ నాని చేత విష్ చేయించారు. ఇలా మూవీ టీం ఎస్ జే సూర్యకు వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపింది. ఆయన పుట్టిన రోజున ఆ పాత్రను ఈ స్పెషల్ వీడియోతో రివీల్ చేశారు. ఈ వీడియోలో ఎస్ జే సూర్యను నరకాసురుడితో పోలుస్తూ.. నానీ, ప్రయాంక మోహన్‌ను శ్రీకృష్ణుడు సత్యభామతో పోల్చారు.
ఈ ఒక్క వీడియోతో సరిపోదా శనివారం మూవీ ఎలా ఉండబోతుందని హింట్ ఇచ్చేసింది మూవీ టీం. ఈ వీడియో ఎస్.జే సూర్య క్రూరమైన పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. విచక్షణ లేకుండా ప్రజలపై దాడి చేయడం, లాకప్‌లో వేసి రక్తం వచ్చేలా కొట్టడం చూస్తుంటే అతడిది ఇందులో పవర్పుల్ విలన్‌గా కనిపంచడబోతున్నాడని తెలుస్తుంది. అధికారంతో ప్రజలను అతి క్రూరంగా హింసిస్తున్న అతడిని నాని ఎలా కట్టడి చేశాడు.. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి అనేదే సరిపోదా శనివారం కథ అనిపిస్తుంది. ఈ వీడియోకి జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. మొత్తానికి ఎస్‌జే సూర్య బర్త్‌డే స్పెషల్ వీడియో మూవీపై అంచనాలు పెంచుతుంది.
పెళపెళమను శబ్దమే……
— DVV Entertainment (@DVVMovies) July 20, 2024
అదిరెను ఆకాశమే……
ఘనా ఘనుల ఘాతమే…..
ధగ ధగ ధర దగ్ధమే 🔥🔥#NotATeaserhttps://t.co/ZsjCejDnq1#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/LEcbbqQpz5
ఈ సినిమాలో హీరో ప్రతి శనివారం రకరకాలుగా ప్రవర్తించడం అనే స్టోరీతో తీసినట్టు మూవీ టీం ఇప్పటికే వెల్లడించింది. ఆగస్టు 29న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కాగా నాని-వికేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వస్తున్న సరిపోదా శనివారం మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ ఆరుళ్ హీరోయిన్‌గా నటించారు.