Allu Arjun-Trivikram: 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్‌తోనే అల్లు అర్జున్ సినిమా - ఇది అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ - బన్నీవాసు
Allu Arjun-Trivikram Movie: అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాపై నిర్మాత బన్నీ వాసు సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. పుష్ప2 తర్వాత బన్నీ చేయబోది త్రివిక్రమ్ సినిమానే అని స్పష్టం చేశారు.
Bunny Vasu Comments on Trivikram and Allu Arjun Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి రూమర్స్ వినిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్‌కి గొడవ అయ్యిందని, బన్నీ గడ్డం ట్రిమ్ చేసుకుని ఫారెన్ వెళ్లిపోయారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో పుష్ప 2 వాయిదా పడిందంటూ నెట్టింట గాసిప్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్-సుకుమార్ మధ్య గొడవలపై తాజాగా నిర్మాత బన్నీవాసు స్పందించారు.
'ఆయ్' మూవీ పాట్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మీడియాతో ఇంటారాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్-అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వస్తుందని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై కూడా అప్‌డేట్ ఇచ్చారు. పుష్ప: ది రూల్ మూవీ తర్వాత బన్నీ త్రివిక్రమ్ మూవీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ చిత్రం పాన్ ఇండియాగా రానుంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పడుతుందన్నారు.
కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీయబోతున్నారంటూ బన్నీవాసు సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. అలాగే ఈ మూవీ కాన్సెప్టను లాక్ చేయానికి అల్లు అర్జున్-త్రివిక్రమ్ ఏడాదిన్నర టైం తీసుకున్నారని బన్నీ వాసు చెప్పారు. ఇదివరకు ఎన్నడూ చూడని ఓ కొత్త జానర్ అని, అందుకే త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ టైం తీసుకొంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా ఇది వరకు త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యామూర్తి, అలా వైకుంఠపురంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. వీరిద్దరి హ్యాట్రిక్ హిట్ కాంబో.
దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ అనగానే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కావడం, అదీ కూడా కొత్త జానర్‌తో వస్తుండటంతో మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇది వరకు ఉన్న బజ్ ప్రకారం గురూజీ ఈ సినిమాను 'కల్కి 2898 ఏడీ' స్టైల్లో ప్లాన్ చేసినట్టు గుసగుసల వినిపించాయి. ఇప్పటి వరకు సాంఘీక అంశాలపై సినిమాలు తీసిన త్రివిక్రమ్ మొదటిసారి బన్నీ కోసం మైథలాజికల్ జానర్‌ని టచ్ చేశాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ అండ్ టీం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: నాగ చైతన్య 'తండేల్' వాయిదా పడనుందా? - కారణమేంటంటే!
'పుష్ప 2'పై వస్తున్న రూమర్స్ వింటే నవ్వు వస్తుంది
ఇక పుష్ప 2 రూమర్స్‌పై ప్రస్తావిస్తూ.. పుష్ప 2పై గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పార్ట్ ఇంకా 15 నుంచి 20రోజుల లోపే ఉందని, ఎడిటింగ్ అయ్యాక బ్యాలెన్స్ ఉంటే అప్పుడు షూటింగ్ పెట్టుకుందామని సుకుమార్ అన్నారన్నారు. అందుకే బన్నీ తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారని చెప్పారు. అల్లు అర్జున్ - సుకుమార్‌ల ఆ బాండింగ్ ఎప్పటికీ అలానే ఉంటుందని, వారిమధ్య మనస్పర్థలు వచ్చే అవకాశమే లేదంటూ రూమర్స్‌కి చెక్ పెట్టారు.