అన్వేషించండి

Allu Arjun: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసిన మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 

Allu Arjun Team Up With Nelson: అల్లు అర్జున్‌-డైరెక్టర్‌ అట్లీ మూవీ క్యాన్సిల్‌ అయిన సంగతి తెలిసిందే. అంతలోనే బన్నీ మరో తమిళ స్టార్‌ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.

Allu Arjun Next Movie With Direcor Nelson: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. గత మూడేళ్లుగా బన్నీ పుష్ప సీక్వెల్స్‌తోనే ఫుల్‌ బిజీ అయిపోయాడు. ఏడాది ఒకటి, రెండు సినిమాలు చేసే బన్నీ మూడేళ్లుగా ఒకే ప్రాజెక్ట్‌పై ఉన్నాడు. దీంతో అతడి నెక్ట్స్‌ సినిమా ఏంటనేది ఆసక్తి నెలకొంఆది. పుష్ప పార్ట్‌ వన్‌తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. మరి బన్నీ నెక్ట్స్‌ సినిమాల లైనప్‌ ఏంటీ, ఎలాంటి జానర్‌లో వస్తున్నాడా అని ఫ్యాన్స్‌ క్యూరియాసిటీగా ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ కథలు వింటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సందీప్‌ రెడ్డి వంగా, తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీలతో సినిమాలు చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆ మధ్య 'యానిమల్‌' డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి ఉన్న ఫోటో కూడా రిలీజ్‌ చేశారు. ఈ ముగ్గురు కాంబోలో ఓ సినిమా ఉండనుందనేది స్పష్టమైంది . కానీ అదే ఏ జానర్‌, కథేంటి అనేది ఏం క్లారిటీ లేదు. పుష్ప 2 అయిపోగానే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడని ముందు నుంచి ప్రచారం ఉంది. అది కన్‌ఫాం. ఇక అట్లీతో సినిమా క్యాన్సల్‌ అయినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇది బయటకు రావడంతో అభిమానుల్లో కాస్తా టెన్షన్‌ మొదలైంది. అట్లీతో బన్నీ సినిమా అనగానే ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. అంతలోనే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనే వార్త బయటకు రావడంతో డిసప్పాయింట్‌ అయ్యారు.

ఇక అట్లీ ఇలా అవుట్‌ అయ్యాడో లేదో.. బన్నీని తాజాగా మరో తమిళ స్టార్‌ డైరెక్టర్‌ కలిశారట. ఆయనే 'జైలర్‌' ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. తాజాగా నెల్సన్‌ బన్నీ కలిసి కథ వినిపించినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథకు బన్నీ ఒకే చెప్పాల్సి ఉందట. అంతా ఒకే అయితే నెల్సన్‌తో బన్నీ మూవీ ఫైనల్‌ అయినట్టే అని తెలుస్తోంది. అట్లీ అవుట్‌ అయినా మరో స్టార్‌ డైరెక్టర్‌ లైన్లో రావడంతో అల్లు ఫ్యాన్స్‌ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా ఉండేలా కనిపించడం లేదు. కాగా.. 'పుష్ఫ 2' తర్వాత అల్లు అర్జున్‌ని ఏ డైరెక్టర్‌ని లైన్‌లో పెడతాడా? అనేది ఆసక్తి నెలకొంది. చూస్తుంటే పుష్ప 2 అయిపోయాగానే ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమాని పట్టాలెక్కించేలా కనిపిస్తున్నాడు. సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌ 'స్పిరిట్‌' స్క్రిప్ట్‌ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఏడీ తర్వాత  మూవీ సెట్స్‌పైకి తీసుకురావాల్సి ఉంది.

ఆ తర్వాతే అల్లు అర్జున్‌తో సినిమా స్టార్ట్‌ చేసే ఆలోచన సందీప్‌ ఉన్నాడట. అందుకే పుష్ప 2 అయిపోయిన వెంటనే త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్‌ చేసేందుకు బన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్‌ ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడట. పుష్ఫ 2 రిలీజ్‌ తర్వాత కాస్తా గ్యాప్‌ తీసుకుని 2025 మేలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట.  గురూజీ  ఈ సినిమాను 'కల్కి 2898 ఏడీ' స్టైల్లో ప్లాన్ చేసినట్టు టాక్. ఇప్పటి వరకు సాంఘీక అంశాలపై సినిమాలు చేసిన త్రివిక్రమ్‌ మొదటిసారి బన్నీ కోసం మైథలాజికల్‌ జానర్‌ని టచ్ చేశాడట. ప్రస్తుతం త్రివిక్రమ్‌ అండ్‌ టీం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read: జూనియర్ ఎన్‌టీఆరే టాప్, అతడి తర్వాతే ఆ హీరోలు - కోట శ్రీనివాస రావు వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

The Dirty Picture 2: విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Sobhita Dhulipala: అక్కినేని ఫ్యాన్స్‌కు శోభిత షాక్... చైతూతో పెళ్ళయ్యాక బోల్డ్ ఫోటోషూట్
అక్కినేని ఫ్యాన్స్‌కు శోభిత షాక్... చైతూతో పెళ్ళయ్యాక బోల్డ్ ఫోటోషూట్
Ram Charan - Sara Arjun: రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ - నిర్మాత ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే?
రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ - నిర్మాత ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget