Sonakshi Sinha: యంగ్ హీరోతో సోనాక్షి సిన్హా పెళ్లి - ఇన్విటేషన్ కూడా రెడీ
Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.. యంగ్ హీరో జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈ పెళ్లి ఇన్విటేషన్ కూడా రెడీ అయ్యిందట.
Sonakshi Sinha Marriage: బాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆలియా భట్, రణబీర్ కపూర్.. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.. తరహాలోనే ఇప్పుడు సోనాక్షి, జహీర్ ఇక్బల్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్బల్‌తో డేటింగ్‌లో ఉన్న ఈ భామ.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతుందనే వార్త బయటకొచ్చింది. పెళ్లి కూడా ఈ నెలలోనే ప్లాన్ చేశారని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఫోటోలు..
2010లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ అనే మూవీతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటర్ అయ్యింది సోనాక్షి సిన్హా. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో, హిట్లతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. గత కొన్నేళ్లుగా జహీర్ ఇక్బాల్ అనే అప్‌కమింగ్ హీరోతో సోనాక్షి లవ్‌లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ‘నోట్‌బుక్’ అనే మూవీతో బాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టాడు జహీర్. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ విషయం కేవలం రూమర్స్ మాత్రమే కాదని, నిజమే అనిపించేటట్టుగా సోనాక్షి, జహీర్ కలిసి పలు ఈవెంట్స్‌లో చాలా క్లోజ్‌గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసేవారు.
జూన్‌లోనే..
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ కలిసి రీల్స్ చేయడం, ఒకరి బర్త్‌డేను మరొకరు స్పెషల్‌గా సెలబ్రేట్ చేయడం.. ఇదంతా ఎప్పటినుండో జరుగుతోంది. వీరి రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గా ఎప్పుడూ కామెంట్ చేయకపోయినా సినిమా ఈవెంట్స్‌లో మాత్రం ఎక్కువగా కలిసే కనిపించడంతో సోనాక్షి, జహీర్‌ల ప్రేమ గురించి రూమర్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయి. కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారని వార్తలు వచ్చినా.. అవన్నీ రూమర్సే అని సోనాక్షి క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు మరోసారి అవే రూమర్స్ తెరపైకి వచ్చాయి. జూన్ 23న ముంబాయ్‌లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్విటేషన్ రెడీ..
ఇప్పటికే సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లికి ఇన్విటేషన్ కూడా సిద్ధమయ్యిందని తెలుస్తోంది. ‘ఈ రూమర్స్ నిజమే’ అనే స్టేట్‌మెంట్‌తో ఈ ఇన్విటేషన్‌ను డిజైన్ చేశారట. ముంబాయ్‌లోని బస్తియన్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. జూన్ 2న సోనాక్షి సిన్హా పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశాడు జహీర్. అప్పటినుండి వీరి పెళ్లి గురించే అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సోనాక్షి చివరిగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో ఫరీదాగా నటించి హిట్ సాధించింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా ‘హీరామండి’ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం సోనాక్షి, జహీర్ పెళ్లికి హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
View this post on Instagram
Also Read: శ్రీలీలకు సూపర్ ఛాన్స్ - బాలీవుడ్ డెబ్యూలో ఆ స్టార్ హీరో కొడుకుతో!?