![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Software Employee Problems: సాఫ్ట్‌వేర్ పోరగా నీకు అవసరమేనా ఈ పిల్ల?
కాయగూరల మార్కెట్‌లో అమ్మాయితో సాఫ్ట్‌వేర్ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథతో 'మార్కెట్ మహాలక్ష్మి' సినిమా రూపొందింది. ఇందులో తొలి పాటను తాజాగా విడుదల చేశారు.
![Software Employee Problems: సాఫ్ట్‌వేర్ పోరగా నీకు అవసరమేనా ఈ పిల్ల? Software Poraga song from Market Mahalakshmi out now Parvateesam Software Employee Problems: సాఫ్ట్‌వేర్ పోరగా నీకు అవసరమేనా ఈ పిల్ల?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/c996a6227d4d521eba85687ffc80120f1709792851289313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథతో రూపొందిన తెలుగు సినిమా 'మార్కెట్ మహాలక్ష్మి' (Market Mahalakshmi Movie). 'కేరింత' ఫేమ్ పార్వతీశం (Parvateesam) హీరోగా, ఆయన సరసన మహాలక్ష్మి పాత్రలో ప్రణీకాన్వికా నటించారు. ఇందులో తొలి పాట 'సాఫ్ట్‌వేర్ పొరగా...'ను తాజాగా విడుదల చేశారు.
అవసరమా ఈ పిల్ల?
కట్నం తెచ్చేటి అమ్మాయే ఉండగా!
'మార్కెట్ మహాలక్ష్మి' సినిమాకు జో ఎన్ మవ్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన 'సాఫ్ట్‌వేర్ పొరగా...' బాణీకి వీఎస్ ముఖేష్ సాహిత్యం అందించగా... లోకేశ్వర్ ఈదర ఆలపించారు.
హీరో తండ్రి కట్నం తెచ్చే కోడలు కావాలని చూస్తున్నారు. ఆయన కోరే కట్నం ఇచ్చే అమ్మాయిలు ఉండగా... మార్కెట్ మహాలక్ష్మి వెంట పడ్డాడు హీరో. ఆ నేపథ్యంలో వచ్చే పాటగా తెలుస్తోంది. ఆల్రెడీ విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుందని, ఈ పాట విడుదలైన వెంటనే బోలెడు మెస్సేజులు వచ్చాయని దర్శక నిర్మాతలు తెలిపారు. అతి త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని చెప్పారు.
#SoftwarePoraga's Lyrical Video Song out now!! Don't miss it on #B2PStudios!
— Journalist Venkatesh (@vickyvenki1) March 6, 2024
Watch The Link Here
👇🏻👇🏻👇🏻👇🏻https://t.co/TNqHdBCjhp#MM @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa @vickyvenki1 @filmcombat @RainbowMedia_ pic.twitter.com/6n3tKN5qaA
ప్రపోజ్ చేస్తే చెంపదెబ్బ కొట్టిన హీరోయిన్!
'మార్కెట్ మహాలక్ష్మి' టీజర్ చూస్తే... తనకు ఇండిపెండెంట్ అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్పే సాఫ్ట్‌వేర్ యువకుడిగా పార్వతీశాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత మార్కెట్ మహాలక్ష్మిగా, కూరగాయలు అమ్మే అమ్మాయిగా ప్రణీకాన్వికా పాత్రను చూపించారు.
హీరోది అమలాపురం. అతడికి ఉద్యోగం రావడంతో ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. మార్కెట్టులో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడతాడు. అయితే, ఆ అమ్మాయితో అతని తల్లికి గొడవ అవుతుంది. నచ్చిందని చెబితే అమ్మాయి లాగి పెట్టి ఒక్క చెంపదెబ్బ ఇచ్చింది. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినందుకు అమ్మ కూడా కొట్టింది. పాపం... ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చివరికి ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది మనకు తెలియాలంటే సినిమా చూడాలి.
Also Read: ప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ
ఖాకీ చొక్కాలో కొత్తగా గోపీచంద్...
— ABP Desam (@ABPDesam) March 6, 2024
'భీమా' సినిమాలో స్టిల్స్ చూశారా?#Gopichand #bhimaaonmar8th #BHIMAA #malvikasharma #priyabhavanishankar #ABPDesam #moviestills @SriSathyaSaiArt https://t.co/0lcXd0iFo0
'మార్కెట్ మహాలక్షి' సినిమాకు కళా దర్శకుడు: సంజన కంచల, నృత్య దర్శకత్వం: రాకీ, నేపథ్య సంగీతం: సృజన్ శశాంక, సాహిత్యం: వీఎస్ ముఖేష్ - జో ఎమ్నావ్, కూర్పు: ఆర్ఎం విశ్వనాథ్ కుంచానపల్లి, ఛాయాగ్రహణం: సురేంద్ర చిలుముల, స్వరాలు: జో ఎమ్నావ్, నిర్మాత: అఖిలేష్ కిలారు, రచన - దర్శకత్వం: వీఎస్ ముఖేష్.
Also Read: అమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)