అన్వేషించండి

Most Popular Indian Stars Of 2024: సమంతను బీట్ చేసిన శోభిత... షారుఖ్‌ను వెనక్కి నెట్టి నెంబర్ 1గా నిలిచిన 'యానిమల్' హీరోయిన్

IMBD 2024 top 10 most popular Indian actors: ఐఎండిబి టాప్ 10 ఇండియన్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ తాజాగా వచ్చేసింది. ఇందులో సమంత కంటే శోభిత ముందంజలో ఉండడం విశేషం.

'యానిమల్' హీరోయిన్ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) క్రేజ్ రోజు రోజుకూ మరింతగా పెరుగుతోంది. గత ఏడాది మోస్ట్ ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజాగా మరోసారి ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకుని, క్రేజ్ పరంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)ను బీట్ చేయడం విశేషం. 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచి, అరుదైన రికార్డును క్రియేట్ చేసింది త్రిప్తి. క్రేజ్ లో షారుక్ ఖాన్, దీపిక పదుకొనే, అలియా భట్ లాంటి పెద్ద స్టార్లను ఆమె వెనక్కి నెట్టడం విశేషం. 

కొత్త సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో, ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మంది డిజిటల్ విజిటర్స్ నుంచి వచ్చిన పేజీ వ్యూస్ ఆధారంగా, ఐఎండిబి టాప్ 10 ఇండియన్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ ను తాజాగా వెల్లడించింది. 2024లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో త్రిప్తి దిమ్రి అగ్రస్థానంలో నిలిచింది. షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ లేదా దీపికా పదుకొనే వంటి సూపర్ స్టార్‌లకు బదులుగా, ఉత్తరాఖండ్‌లో జన్మించిన నటి త్రిప్తి దిమ్రి 2024కి భారతదేశపు హాటెస్ట్ ఫిల్మ్ స్టార్‌గా అగ్రస్థానంలో నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది త్రిప్తికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ఉన్న త్రిప్తి రీసెంట్ గా కాలా, బుల్బుల్, యానిమల్, లైలా మజ్ను, భూల్ భూలయ్యా 3 వంటి చిత్రాలలో నటించి బాగా పాపులారిటీని సంపాదించింది.

ఇక ఈ లిస్టులో నెంబర్ వన్ ప్లేస్ లో నిలవడం గురించి స్పందిస్తూ... త్రిప్తి తన అభిమానుల ప్రేమ, సపోర్ట్ కి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇలా నెంబర్ వన్ ప్లేస్ లో నిలవడం గొప్ప గౌరవం అని చెప్పుకొచ్చింది. 2023లో కూడా ఐఎండిబి మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులో త్రిప్తి స్థానాన్ని దక్కించుకుంది. 

Also Read: Pushpa 1 Day Collection: కలెక్షన్ల జాతర... మొదటి రోజే 'ఆర్ఆర్ఆర్' రికార్డుల పాతర - ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ 'పుష్ప 2', ఎన్ని కోట్లో తెలుసా?

ఇక ఐఎండిబి 2024 టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్టులో టాప్ సెలబ్రిటీల విషయానికి వస్తే... నెంబర్ 1లో తృప్తి, రెండో స్థానంలో దీపిక పదుకొనే, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖత్తర్, షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఈ లిస్టులో టాప్ 5లో శోభిత ధూళిపాల నిలవడం విశేషం. ఇక ఆరు, ఏడు స్థానాల్లో శార్వరి, ఐశ్వర్యరాయ్ ఉండగా, సమంత ఎనిమిదో ప్లేస్ దక్కించుకుంది. తొమ్మిదో ప్లేస్ లో అలియా భట్, టాప్ టెన్ లో ప్రభాస్ ఉండడం విశేషం. ఇదిలా ఉండగా ఈ లిస్టులో సౌత్ నుంచి శోభిత, సమంత, ప్రభాస్ లాంటి స్టార్స్ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే సమంత క్రేజ్ కంటే శోభితకే ఎక్కువగా పాపులారిటీ ఉండడం గమనర్హం.

'మంకీ మ్యాన్‌'తో హాలీవుడ్‌లో అడుగు పెట్టి, 'లవ్ సితార' అనే సినిమాలో నటించింది శోభితా ధూళిపాల. అయితే ఆమె సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలిచింది. నాగ చైతన్యతో వివాహం ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చి పెట్టింది. ఇక సమంత అమెజాన్ ప్రైమ్ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ'లో కనిపించింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఆరోగ్య సమస్యలు, ఆమె వ్యక్తిగత జీవితం గురించి చర్చలు ఆమెను ట్రెండింగ్ లో ఉండేలా చేశాయి. 

Also Readసుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Embed widget