అన్వేషించండి

Sitara Ghattamaneni - PMJ AD : యువరాణిలా మెరిసిన కుందనపు బొమ్మ సితార - మురిసిపోయిన మహేష్, వీడియో చూశారా?

మహేష్ బాబు కూతురు సితార ఇటీవల ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి సంబంధించిన కమర్షియల్ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ యాడ్ కి సంబంధించిన వీడియోని తాజాగా రిలీజ్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రతల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సితార సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటిని సంపాదించుకుంది. ఫోటోలు, డాన్స్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక రీసెంట్ గా సితార ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన విషయం తెలిసిందే. PMJ జ్యువెలరీస్ కోసం సితార ఓ కమర్షియల్ యాడ్ లో కూడా నటించింది. ఇక ఈ యాడ్ కి సంబంధించి ఇటీవల కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. అంతేకాకుండా సితార ఆ ప్రముఖ జ్యువెలరీ ధరించిన ఫోటోలను ఏకంగా న్యూయార్క్ టైం స్క్వేర్స్ లో ప్రదర్శిస్తూ ప్రమోషన్ చేశారు.

సితార ఇలా ఒక జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉంటూ కమర్షియల్ యాడ్ చేయడం అది కాస్త టైం స్క్వేర్స్ పై ప్రదర్శించడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ సితార పాప తన తండ్రిని మించిపోయిందని, ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందంటూ కామెంట్స్ చేశారు. అటు మహేష్ బాబు కూడా  దీనిపై తన స్పందనను కనబరిస్తూ.. 'తన కూతుర్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని' మురిసిపోయాడు. ఇక తాజాగా PMJ జ్యువెలర్స్ కోసం సితార నటించిన కమర్షియల్ యాడ్ కి సంబంధించిన వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ యాడ్లో సితార ప్రిన్సెస్ లా మెరిసిపోయింది. ఈ యాడ్ ని చాలా సరికొత్తగా డిజైన్ చేశారు. తాజాగా ఈ యాడ్ వీడియోని మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈ యాడ్ ని ఒకసారి గమనిస్తే.. అమెరికా నుంచి తన ఓణీల ఫంక్షన్ కోసం సితార తన తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వస్తుంది. సితార మూడీగా కనిపించడంతో అమ్మమ్మ నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళు నిన్ను ప్రిన్సెస్ లా చూసుకుంటారు అని చెప్తూ PMJ జ్యువెలర్స్ కి తీసుకెళ్తుంది. అక్కడ నగలను చూపిస్తుంటే.. 'అమ్మమ్మ ఇదంతా అవసరమా?' అని సితార చెబుతుంది. ఆ తర్వాత షాప్ అతను ఒకసారి అక్కడికి వెళ్లి చూడు ఏముందో అని చెప్పడంతో సితార షాప్ లోపలికి వెళ్తుంది. వెళ్లగానే తనను తాను PMJ జ్యువెలర్స్ ధరించి ఒక క్వీన్ లాగా చూపించినట్టు యాడ్ ని చాలా క్రియేటివిటిగా డిజైన్ చేశారు. ఇక సితార తనను తాను అలా చూసుకోవడంతో అది ఆమెకు ఎంతగానో నచ్చుతుంది. దాంతో PMJ జ్యువెలరీస్ తోనే తన ఓణీల ఫంక్షన్ ఎంతో హ్యాపీగా చేసుకుంటుంది.

ఇక ఈ యాడ్లో సితార తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా జ్యువెలరీ మొత్తం వేసుకొని కనిపించిన షాట్ లో అయితే అచ్చం ప్రిన్సెస్ లా ఉంది. దీంతో ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ ని సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోని చూసిన ఫ్యాన్స్ ఈ యాడ్లో సితార స్మైల్ చాలా బాగుందని, నగలతో అచ్చం మహారాణిలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ యాడ్ కోసం సితార సుమారు 70 నుంచి కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : అలియా భట్ తో అంబానీ రూ.300 కోట్ల భారీ డీల్ - దేనికో తెలుసా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget