
Sirish Bhardwaj: అప్పుడు డబ్బులు ఇస్తామన్నారు - కొడుకు మృతిపై వస్తున్న వార్తలపై స్పందించిన చిరు చిన్నల్లుడు శిరీష్ తల్లి
Srija Ex Husband Sirish Bhardwaj: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల మరణించగా తన మృతిపై ఎన్నో వార్తలు వచ్చాయి. వాటన్నింటితో పాటు తన విడాకులపై కూడా తన తల్లి క్లారిటీ ఇచ్చారు.

Sirish Bhardwaj Mother: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. 39 ఏళ్లలోనే శిరీష్ మృతి చెందడంతో తన మరణానికి కారణాలు ఇవే అంటూ పలు రూమర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. తాజాగా శిరీష్ భరద్వాజ్ తల్లి.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో శిరీష్ మరణం గురించి క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్టుగా తన కొడుకు లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల చనిపోలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూలో ఆమె మరెన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నెలరోజులు ఆసుపత్రిలోనే..
శిరీష్ భరద్వాజ్.. గుండెపోటుతో చనిపోయాడని తన తల్లి తెలిపారు. కొన్నేళ్లుగా తమ కుటుంబమంతా హైదరాబాద్‌లోనే ఉంటున్నామని చెప్పుకొచ్చారు. మే 13న శిరీష్.. తన పుట్టినరోజును జరుపుకోవడానికి దుబాయ్ వెళ్లాడని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన రోజు నుంచి అతడి ఆరోగ్యం సరిగా లేదని గుర్తుచేసుకున్నారు. మే 17న జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని అన్నారు. దాదాపు నెలరోజులు శిరీష్ ఆసుపత్రిలోనే ఉన్నాడని చెప్తూ బాధపడ్డారు. అలా నెలరోజులు గడిచిన తర్వాత జూన్ 19న అకస్మాత్తుగా గుండెపోటుతో తాను మరణించాడని తన తల్లి స్పష్టం చేశారు. శిరీష్ మరణ వార్త బయటికి రాగానే కొన్ని మీడియా సంస్థలు అతడి మరణం గురించి తప్పుగా రాసాయని, అందులో నిజం లేదని వాపోయారు.
శ్రీజ మంచిది..
2007లో చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శిరీష్ భరద్వాజ్. అప్పట్లో ఈ ప్రేమ పెళ్లి వార్త ఒక సంచలనంగా మారింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో శ్రీజ గురించి కూడా శిరీష్ తల్లి స్పందించారు. శ్రీజ చాలా మంచి అమ్మాయి అని, అందరూ అనుకుంటున్నట్టుగా విడాకుల విషయంలో తనపై నిందలు వేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే శ్రీజ, శిరీష్ పెళ్లి, విడాకులు అయ్యి చాలా ఏళ్లు కావడంతో అసలు వారు ఎందుకు విడిపోయారో తనకు కూడా సరిగా గుర్తులేదన్నారు. ఇక వారిద్దరికీ పుట్టిన పాప నివృత్తిని చూస్తుంటే తనకు తన కొడుకు శిరీషే గుర్తొస్తాడని అన్నారు. శిరీష్ మరణించిన తర్వాత చిరంజీవి కుటుంబానికి సమాచారం అందించినా వాళ్లెవ్వరూ అంత్యక్రియలకు కూడా రాలేదని బయటపెట్టారు.
డబ్బులు ఇస్తామన్నారు..
అందరిలాగానే తనకు కూడా తన మనవరాలిని చూడాలని ఉంటుంది శిరీష్ తల్లి వాపోయారు. వాళ్లు పెద్దవాళ్లు కాబట్టి తనకు ఆ అవకాశం కల్పిస్తే బాగుంటుందని అన్నారు. విడాకుల సమయంలో శ్రీజ నుంచి శిరీష్‌కు రూ.33 కోట్లు అందాయని వార్తలు వైరల్ అయ్యాయి. దానిపై శిరీష్ తల్లి స్పందించారు. ఒకవేళ అంత డబ్బు తీసుకొని ఉంటే అద్దె ఇంట్లో ఎందుకు ఉంటాం అని ప్రశ్నించారు. మెగాస్టార్ కుటుంబం డబ్బు ఇస్తామన్నా తాము ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఇక శిరీష్ తల్లి ఒకప్పుడు తెలంగాణ ఆర్టీసీలో మ్యానేజర్‌గా పనిచేసేవారు. చాలాకాలం క్రితమే రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం తన చిన్న కుమారుడితో కలిసుంటున్న ఆమెకు తన మనవరాలు నివృత్తిని చూడాలనే కోరిక బలంగా ఉందని వాపోయారు.
Also Read: ఒడిశాలో ఆ బిజినెస్ ప్రారంభించిన సన్నీ లియోన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

