మెగాస్టార్ చిరంజీవి గురించి మీకు తెలిసిందే. చిరు జీవితం ఎంతోమందికి స్ఫూర్తి.

జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. అలాగే సినిమాల్లో హిట్-ఫ్లాప్స్ కూడా.

చిరంజీవి సైతం ఎన్నో ఫ్లాప్స్ చూశారు. కానీ, ‘అంజి’ సినిమా మరిచిపోలేని ఫ్లాప్.

2004లో సుమారు రూ.25 కోట్ల బడ్జెట్‌తో ‘అంజి’ సినిమా తెరకెక్కించారు.

మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు.

హాలీవుడ్ తరహా గ్రాఫిక్స్‌తో సుదీర్ఘంగా ఈ చిత్ర నిర్మాణం సాగింది.

ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో కూడా అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కోసం చిరు ఒకే చొక్కాను ఉతక్కుండా రెండేళ్లు ధరించారట.

ఈ విషయాన్ని దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రేక్షకుల అంచనాలు ఎక్కువ పెట్టుకోవడం, ఆలస్యంగా రిలీజ్ కావడమే ఫ్లాప్‌కు కారణం.

1997లో షూటింగ్ మొదలైతే.. ఏడేళ్ల తర్వాత 2004లో ఈ సినిమా విడుదలైంది.

Images Credit: Social Media and Anji Movie