‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఆ తర్వాత గోపిచంద్‌తో ‘జిల్’ చిత్రంలో పూర్తి భిన్నంగా కనిపించి షాకిచ్చింది. రాశీ ఖన్నా కెరీర్‌లో హిట్స్ ఎన్ని ఉన్నాయో ఫ్లాప్స్ కూడా అన్నే ఉన్నాయ్. ఇటీవల రాశీ ఖన్నా టైమ్ అస్సలు బాగోలేదు. ఏది పట్టుకున్నా మట్టే. ‘పక్కా కమర్షియల్’ సినిమా హిట్ కొడుతుందంటే.. తుస్ అనిపించింది. తాజాగా వచ్చిన ‘థాంక్యూ’ మూవీ కూడా అదే బాటలో నడిచింది. దీంతో రాఖీ ఖన్నాకు దిగులు పట్టుకుంది. వరుస ఫ్లాప్‌లు కెరీర్‌కు అడ్డొస్తాయనే ఆందోళన రాశీని వెంటాడుతోంది. తాజాగా రాశీ వేదాంతం వల్లిస్తూ.. హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. విజయం కోసం ‘లిఫ్ట్’ రాదని, మెట్లు ఎక్కితేనే సాధ్యమని చెప్పింది. దీంతో ఆమె ఫ్యాన్స్.. ఏం చెప్పావ్ రాశీఖన్నా అని పొగిడేస్తున్నారు. Images Credit: Rashi Khanna/Instagram