అదిరిపోయే డ్యాన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. సినిమాల్లో ఔరా అనిపించింది పూర్ణ.

బొద్దుగా మారడం వల్ల హీరోయిన్ అవకాశాలు సన్నగిల్లాయి.

ఇక పూర్ణ కేరిర్ ముగిసిందని అనుకొనేలోపు ‘ఢీ’షోలో ప్రత్యక్షమైంది.

ఇప్పుడు టీవీ షోస్‌‌కే అందాన్ని తెస్తోందని బుల్లితెర ప్రేక్షకులు అంటున్నారు.

ఈ మధ్య సినిమాల్లో కూడా వివిధ పాత్రల్లో పూర్ణ కనిపిస్తోంది.

పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో సహాయ నటిగా అవకాశాలు అందుకుంటోంది.

ప్రస్తుతం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కూడా పూర్ణ జడ్జిగా ఉన్నారు.

పూర్ణ త్వరలో హీరో నాని నటిస్తున్న ‘దసరా’లో విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

‘దసరా’లో పూర్ణ పాత్రకు గుర్తింపు వస్తే.. ఇక ఆమె వెనక్కి చూసుకో అక్కర్లేదు.

Images & Videos Credit: Shamna Kkasim/Instagram