‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్ చూశారా? అందులో బొద్దుగా ఓ అమ్మాయి ఉంటుంది.

ప్రవల్లిక పాత్రలో నటించిన ఆమె పేరు నిత్యా శెట్టి.

నిత్యాశెట్టి మరెవ్వరో కాదు.. ‘దేవుళ్లు’ సినిమాలో బాలనటి.

బాలనటిగా తొలి చిత్రమైన ‘చిన్ని చిన్ని ఆశ’లో నటనకు నంది అవార్డు అందుకుంది.

చిరంజీవి చిత్రం ‘అంజి’లో కూడా నిత్య బాలనటిగా నటించింది.

ఆ తర్వాత ‘నువ్వు తోపురా’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

‘పిట్ట కథ’ సినిమాతో నిత్యా శెట్టి హిట్ కొట్టింది.

ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, ఇప్పుడు ‘హలో వరల్డ్’తో వచ్చింది.

‘హాలో వరల్డ్’ సీరిస్‌లో నిత్య శెట్టి కీలక పాత్ర పోషించింది. క్యూట్‌గా ఆకట్టుకుంది.

ఇటీవల విడుదలైన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నిత్యా శెట్టి అందాలు ఆరేసింది.

ఈ బొద్దుగుమ్మ అందాలకు ఇప్పుడు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

మరి.. నిత్యా శెట్టికి మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Images & Videos Credit: Nitya Shetty/Instagram