Single Box Office Collections Day 2: రెండో రోజు కూడా 'సింగిల్' జోరు - బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు
Sree Vishnu Single Day 2 Collections: శ్రీ విష్ణు 'సింగిల్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.11.2 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Sree Vishnu's Single Second Day Box Office Collections: శ్రీ విష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సింగిల్' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. వరుసగా రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్ కావడంతో ఇవి మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
రెండు రోజుల్లో రికార్డు కలెక్షన్లు
'సింగిల్' హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.11.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే రూ.4.15 కోట్లు, రెండో రోజు రూ.7.05 కోట్లు వచ్చాయి. శ్రీ విష్ణు కెరీర్‌లోనే మరో భారీ హిట్‌గా ఈ మూవీ నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ థియేటర్లు ఫుల్ ఆక్యుపెన్సీతో ఉన్నట్లు మూవీ టీం ప్రకటించింది.
రెండు రోజుల్లో యూఎస్‌లోనూ $300k దాటేసింది. ఇక వీకెండ్‌లో అర మిలియన్ మార్క్ దాటాలని లక్ష్యంతో ఉంది. 24 గంటల్లోనే 80 వేల కంటే ఎక్కువ టికెట్లు సేల్ అయినట్లు 'బుక్ మై షో' వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే రికార్డు వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
#Single is breaking records and providing laughs all over! ❤️🔥
— V Cinemas (@VcinemasUS) May 11, 2025
Smashing the $300K+ mark in USA🔥.
A massive day at the box office!🇺🇸
We are adding extra shows continusuly around the clock…Book your tickets now 🎫
Grand USA release by @VcinemasUS @sreevishnuoffl @GeethaArts… pic.twitter.com/rfWLAwphBF
ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు కామెడీ పంచులు, డైలాగ్స్ అదిరిపోయాయి. వెన్నెల కిశోర్‌తో ఆయన కామెడీ భారీ హైప్ తీసుకొచ్చింది. మాస్, యూత్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు.
సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న శ్రీ విష్ణు 'శ్వాగ్' మూవీతో కాస్త నిరుత్సాహపరిచారు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన శైలిలో డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ఆడియన్స్‌ను మెప్పిస్తారు శ్రీ విష్ణు. ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మంచి కలెక్షన్లు రాబడుతుండడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది. 'సింగిల్'కు సీక్వెల్ కూడా రానుంది.
మరోవైపు.. ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంత భాగం సైనికులకు ఇవ్వనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. సినిమా హిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.





















