Jayam Ravi: ప్రియురాలు వర్సెస్ భార్య - స్టార్ హీరో భార్యకు సింగర్ కౌంటర్?.. మళ్లీ జంటగా..
Kenishaa Francis: కోలీవుడ్ స్టార్ జయం రవి, సింగర్ కెన్నీషా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆర్తి రవి పోస్టుకు ఇండైరెక్ట్‌గా సింగర్ కెన్నీషా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Singer Kenishaa Drops Cryptic Note After Aarti Ravi Statement: కోలీవుడ్ స్టార్ జయం రవి (Jayam Ravi) డివోర్స్ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఆయన తన భార్య ఆర్తి రవితో వివాహ బంధానికి గతేడాది స్వస్తి పలికారు. సింగర్ కెన్నీషాతో రిలేషన్ షిప్ కారణంగానే జయం రవి విడాకులు తీసుకున్నారనే రూమర్స్ వినిపించాయి. అయితే, వీటిని పలు సందర్భాల్లో జయం రవి ఖండించారు. తాజాగా.. వీరిద్దరూ ఓ పెళ్లి కలిసి కనిపించడంతో మళ్లీ చర్చ మొదలైంది.
జయం రవి, సింగర్ కెన్నీషా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆయన భార్య ఆర్తి రవి స్పందించారు. రవి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఇన్ స్టా వేదికగా ఆయనపై ఆరోపణలు చేస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. దీనిపై తాజాగా సింగర్ కెన్నీషా స్పందించారు.
మంచిగా ఉన్నానని లైట్ తీసుకోకు
ఆర్తి రవి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా సింగర్ కెన్నీషా (Kenishaa) సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'ఒక మగాడు ఎప్పుడూ ఎమోషన్స్‌కు లొంగడు. ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. సైలెంట్‌గా, మంచిగా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు. అదే నిజమైన బలం.' అంటూ పోస్ట్ పెట్టారు. అయితే, ఇది ఆర్తి రవికి కౌంటర్‌గానే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోలీవుడ్ మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి.
అయితే.. తనపై ఆర్తి రవి చేసిన ఆరోపణలపై జయం రవి ఇంతవరకూ స్పందించలేదు. కెన్నీషాతో రిలేషన్ షిప్ కారణంగానే ఆయన భార్యకు విడాకులు ఇచ్చారనే రూమర్లపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్ మీడియా ప్రకారం.. జయం రవి అత్త ఇతని మూవీస్, డేట్స్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుందనే.. భార్యకు విడాకులు ఇచ్చేశాడనే టాక్ కూడా నడుస్తోంది. ఏది నిజమో అనేది ఇప్పటి వరకూ జయం రవి నుంచి స్పందన లేదు.
Also Read: పీవీఆర్ ఐనాక్స్ దెబ్బకు బాలీవుడ్ నిర్మాతలకు షాక్... థియేటర్లలో మానేసి ఓటీటీలో విడుదల చేస్తారా?
రిసెప్షన్ ఈవెంట్‌లో మరోసారి జంటగా..
నిర్మాత ఇషారీ గణేష్ కుమార్తె పెళ్లిలో జయం రవి, సింగర్ కెన్నీషా కలిసి కనిపించడంతోనే మళ్లీ ఈ రచ్చ మొదలైంది. ఆయనపై ఆరోపణలు చేస్తూ భార్య ఆర్తి రవి పోస్ట్ పెట్టగా.. అవేమీ పట్టించుకోకుండా మరోసారి వీరిద్దరూ కలిసి రిసెప్షన్ వేడుకలో కలిసి పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి నూతన వధూవరులకు గిఫ్ట్ అందించి విషెష్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
జయం రవి తన భార్య ఆర్తి రవితో 18 ఏళ్ల వివాహ బంధానికి గతేడాది ముగింపు పలికారు. సింగర్ కెన్నీషాతో రిలేషన్ షిప్ కారణంగానే విడాకులిచ్చారనే రూమర్స్ వినిపించగా వాటిని ఆయన ఖండించారు. ఇద్దరూ కలిసి తాజాగా ఓ పెళ్లిలో కనిపించగా.. జయం రవి భార్య ఆయనపై ఆరోపణలు చేస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. పిల్లలను పట్టించుకోరని.. తనను ఇంటి నుంచి గెంటేశారని అన్నారు. తమ విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. దీనికి సింగర్ కెన్నీషా సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.






















