అన్వేషించండి

Siddhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి టైటిల్ ఫిక్స్ - ‘జాక్’గా వస్తున్న స్టార్ బాయ్!

Siddhu Jonnalagadda : బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి 'జాక్' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Siddhu Jonnalagadda’s New Movie Tittle : 'డీజె టిల్లు' సినిమాతో సిద్ధు జొన్నల్లగడ్డ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, క్రేజ్‌ను సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది ఇక ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కోసమే గత సంవత్సరం నుంచి 'డిజే టిల్లు' సీక్వెల్‌పై వర్క్ చేస్తున్నాడు సిద్ధు. ఇది పూర్తయ్యే వరకు ఇతర కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యాడు.

ఇక 'డీజె టిల్లు' సీక్వెల్ అయిన 'టిల్లు స్క్వేర్' షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండగా.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే వరుస ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్నాడు. రీసెంట్ గానే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ సినిమా నిర్మిస్తున్నారు. SVCC37 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బుధవారం సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

'జాక్'గా వస్తున్న సిద్ధు జొన్నల గడ్డ

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు హీరోగా నటిస్తున్న చిత్రానికి 'జాక్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది₹ ఇందులో సిద్ధు ఈసారి యాక్షన్ మోడ్ లో తన స్టైలిష్ లుక్ తో  ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా రెండు చేతుల్లో రెండు గన్స్ తో కనిపించాడు. అందులో ఒక గన్ ఒరిజినల్, మరొకటి బొమ్మ తుపాకి. మోషన్ పోస్టర్ ని బట్టి ఈ సినిమా యాక్షన్ అండ్ కామెడీ కలబోతగా ఉంటుందని అర్థమవుతుంది.

ఫస్ట్ టైం సిద్దు గన్ పట్టుకొని కనిపించడంతో సినిమాలో ఏమైనా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అంటే మోషన్ పోస్టర్, టైటిల్ ని బట్టి సిద్ధు స్టైలిష్ కాప్ గా కనిపించే అవకాశాలు లేకపోలేదు. ఇక 'జాక్' అనే టైటిల్ కింద 'కొంచెం క్రాక్' అని రాసి ఉంది. ఈ ట్యాగ్ లైన్ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ ని రిప్రెజెంట్ చేసేలా ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమాలో ఓ సరికొత్త సిద్దుని బొమ్మరిల్లు భాస్కర్ చూపించడం గ్యారెంటీ అని అర్థమవుతుంది.

సిద్దు సరసన 'బేబి' హీరోయిన్

'బేబీ' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించి వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉండడంతో మేకర్స్ వైష్ణవి చైతన్యను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది వైష్ణవి చైతన్య.

'టిల్లు స్క్వేర్' థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడే

'టిల్లు స్క్వేర్' సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదల కావాలి. అయితే సంక్రాంతి బరిలో రద్దీ తగ్గించడానికి మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' విడుదల వాయిదా వేశారు. 'ఈగల్' వాయిదా వేసినందుకు 'టిల్లు స్క్వేర్' సినిమాను వాయిదా వేస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. చెప్పినట్లు వాయిదా వేశారు. ఇటీవలే మరోసారి విడుదల తేదీ అనౌన్స్ చేశారు. 'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు.

Also Read : షాక్ ఇచ్చిన విశాల్ - రాజకీయాలపై కీలక ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget