Shruti Haasan: శృతి హాసన్ వెంటపడ్డ అపరిచితుడు, వీడియో వైరల్
కొన్నిసార్లు హీరోయిన్స్‌కు ఫ్యాన్స్ వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తెలిసి, తెలియక కొందరు ఫ్యాన్స్ ప్రవర్తనకు నటీమణులు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా శృతి కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కుంది.
సినీ సెలబ్రిటీలు.. ఎంత కావాలనుకున్నా సింపుల్‌గా జీవించలేరు. మామూలుగా ఉండలేరు. బయట తిరగలేరు. వారు ఎక్కడికి వెళ్లినా.. వెళ్లిన ప్రతీచోటు గురించి, వారు చేసే ప్రతీ పని గురించి బయటపెట్టేవారు ఎవరో ఒకరు ఉంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితాల్లో ప్రైవసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా దాని వల్లే వారు పలు సమస్యలు కూడా ఎదుర్కుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ బయటికి వెళ్లినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా శృతి హాసన్‌కు కూడా అలాగే జరిగింది. ఎయిర్‌పోర్టులో ఒక వ్యక్తి వదలకుండా శృతి హాసన్ వెంటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎయిర్‌పోర్టులో ఒక వ్యక్తి .. శృతిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఆమె వెంట తన టీమ్ ఉన్నా సరే.. ఆ వ్యక్తి ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. దీంతో అతడిని చూసి ఆమె చాలా కంగారు పడింది. బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఆ వ్యక్తి ఎంతకీ అక్కడ నుంచి కదలకపోవడంతో శృతి.. ‘‘అసలు ఆ వ్యక్తి ఎవరు?’’ అని తన టీమ్‌ను అడగడం మొదలుపెట్టింది. ‘‘ఎందుకు ఫాలో అవుతున్నాడు’’ అని అడిగింది. అసలు అతడు ఎవరో తనకు తెలియదని టీమ్‌తో చెప్పింది. చివరికి ఆ వ్యక్తి శృతిని పార్కింగ్ వరకు ఫాలో అయ్యాడు. ఫైనల్‌గా శృతి కార్ ఎక్కే సమయానికి దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అప్పుడు శృతి కొంచెం ఇబ్బందిపడుతూ ‘‘మీరు ఎవరో నాకు తెలియదు సార్’’ అని చెప్పింది. ప్రస్తుతం శృతి హాసన్ ఎదుర్కున్న ఈ ఇబ్బందికర పరిస్థితి గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
View this post on Instagram
‘సలార్’తో పాటు..
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సలార్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ విడుదల అవుతుందని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అది కుదరదు అని మూవీ టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అయితే ‘సలార్’ ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ‘సలార్’ కాకుండా శృతి.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 30వ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ ముద్దుగుమ్మ.. నానితో జతకట్టడం ఇదే మొదటిసారి. దీంతో పాటు ‘ది ఐ’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది శృతి హాసన్. ఇటీవలే శృతి తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి సైమా అవార్డుల్లో మెరిసింది. అభిమానులను అలరించింది.
Also Read: ‘కుమారి శ్రీమతి’గా వస్తున్న నిత్యా మీనన్ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial