అన్వేషించండి

Shruti Haasan: శృతి హాసన్ @ 15 - ఐరన్ లెగ్ నుంచి పాన్ ఇండియా గోల్డెన్ లెగ్ వరకు... జర్నీ అంత ఈజీ కాదు బాస్

కమల్ హాసన్ కుమారైగా శృతి హాసన్ చిత్రసీమలో ప్రవేశించినా... ఆమె ప్రయాణం ఏమీ పూలపాన్పు కాదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఐరన్ లెగ్ అని మాటలు పడ్డారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు గోల్డెన్ లెగ్ అయ్యారు.

Shruti Haasan completes 15 years in films: సినిమా ఇండస్ట్రీలో శృతి హాసన్ అడుగు పెట్టి పదిహేనేళ్ళు పూర్తి అయ్యింది. ఆ అమ్మాయి ఇండస్ట్రీలో పుట్టిందని చెప్పవచ్చు. లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా అందరికీ ఆమె తెలుసు.  'హే రామ్'లో బాల నటిగా ఓ రోల్ చేశారు! అయితే... కథానాయికగా చిత్రసీమలోకి వచ్చి 15 ఏళ్లు. 

Shruti Haasan First Movie: హిందీ సినిమా 'లక్'తో హీరోయిన్‌గా శృతి హాసన్ కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే... కమల్ కుమార్తెగా గుర్తింపు, ఆమిర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ - సంజయ్ దత్ వంటి తారాగణం ఆమెకు విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత కెరీర్ పరంగా ఆమెకు వరుస అవకాశాలు గానీ, విజయాలు గానీ రాలేదు. ఐరన్ లెగ్ అన్నారు కొందరు. కానీ, ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయ్యింది. అదీ పాన్ ఇండియా సినిమాలకు!

'గబ్బర్ సింగ్'తో మారిన శృతి హాసన్ కెరీర్!
'లక్' తర్వాత తెలుగు సినిమా 'అనగనగా ఓ ధీరుడు' చేశారు శృతి హాసన్. దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆశించిన విజయం ఇవ్వలేదు. 'వై థిస్ కొలవెరి డి' సాంగ్ వైరల్ అయ్యింది కానీ... ధనుష్ '3' హిట్ కాలేదు. సూర్య '7 ఏఎం అరివు', హిందీలో 'దిల్ తో బచ్చా హై', తెలుగు సినిమా 'ఓ మై ఫ్రెండ్' శృతి హాసన్ (Shruti Hassan)కు పేరు తెచ్చాయి. కానీ, భారీ విజయాలు అయితే ఇవ్వలేదు. ఆ సమయంలో ఆమె మీద ఐరన్ లెగ్ ముద్ర పడింది. 

నటిగా, కథానాయికగా, అందాల భామగా శృతికి పేరు వచ్చినా... సినిమాలు భారీ విజయాలు సాధించకపోవడం ఆమెకు మైనస్ అయ్యింది. ఆ సమయంలో శృతి హాసన్ కెరీర్ మలుపు తిప్పినది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 'గబ్బర్ సింగ్' సినిమా! దాంతో గోల్డెన్‌ లెగ్‌ అయ్యారు.

నటిగా, కథానాయికగా శృతి హాసన్ ప్రయాణంలో ఫస్ట్ భారీ బ్లాక్ బస్టర్ అంటే 'గబ్బర్ సింగ్' అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్ సైతం కథానాయికగా శృతి పేరు వచ్చినప్పుడు ఆసక్తి చూపించలేదు. కానీ, పవన్ చొరవతో కథానాయిక అవకాశం రావడం... దాన్ని శృతి హాసన్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం జరిగాయి.
 
నటనే కాదు... నృత్యంలోనూ శృతి హాసన్ టాప్!
ఇండస్ట్రీలో వారసులకు సులభంగా అవకాశాలు వస్తాయనేది అపోహ అని బలంగా చెప్పడానికి శృతి హాసన్ ఓ ఉదాహరణ. కమల్ హాసన్ కుమార్తెగా ఆమెకు భారీ, క్రేజీ సినిమాల్లో అవకాశాలు అంత ఈజీగా ఏమీ రాలేదు. 'లక్' ఫ్లాప్ తర్వాత ఆమెకు హిందీ అవకాశాలు ముఖం చాటేశాయి. తెలుగులోనూ స్టార్ హీరోలతో ప్రతిష్టాత్మక సినిమాలు ఏమీ రాలేదు. 'గబ్బర్ సింగ్' విజయం తర్వాతే ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. 

'గబ్బర్ సింగ్' ఫక్తు కమర్షియల్ సినిమా. హీరోయిజం బేస్డ్ ఫిల్మ్! అందులో తనకు లభించిన స్క్రీన్ స్పేస్ ఫుల్లుగా వాడుకుంది శృతి హాసన్. పాటల్లో ఆవిడ చేసిన డ్యాన్సులకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. నటనలోనూ తన మార్క్ చూపించారు. దాంతో రవితేజ 'బలుపు', ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', అల్లు అర్జున్ 'రేసు గుర్రం', రామ్ చరణ్ 'ఎవడు', మహేష్ బాబు 'శ్రీమంతుడు', నాగ చైతన్య 'ప్రేమమ్'... వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటించారు శృతి హాసన్. అప్పటి నుంచి ఆవిడ వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

శృతి హాసన్ కెరీర్‌లో 2023 ఎంతో స్పెషల్!
కథానాయికగా శృతి హాసన్ వెర్సటాలిటీ చూపిస్తున్నారు. రవితేజ 'క్రాక్'లో ఓ చిన్న పిల్లాడికి తల్లిగా నటించడానికి అసలు సందేహించింది లేదు. సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తే... యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం కోల్పోతామని హీరోయిన్లు సందేహిస్తున్న సమయంలో ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి, మరో వైపు నట సింహం బాలకృష్ణతో సినిమాలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు శృతి హాసన్.

Also Read: పెళ్లికి ముందూ తర్వాత... సమంత, దీపికను చూశాక ఎవరైనా ఆ మాట అంటారా?


శృతి హాసన్ కెరీర్‌లో లాస్ట్ ఇయర్ (2023) చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పాలి. 2022లో ఆవిడ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అంతకు ముందు (2021)లో తెలుగు సినిమాలు 'క్రాక్', 'వకీల్ సాబ్' విజయాలు సాధించినా సరే... తమిళ సినిమా 'లాభం' ఫ్లాప్ కాగా, హిందీలో 'ది పవర్' సైతం సేమ్ రిజల్ట్ అందుకుంది. అటువంటి తరుణంలో సంక్రాంతికి విడుదలైన 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' విజయాలు సాధించాయి. ఆ తర్వాత 'హాయ్ నాన్న'లో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ హిట్ అయ్యింది. 'సలార్' పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఏడాది నాలుగు విజయాలు అందుకున్నది ఒక్క శృతి హాసనే.

పాన్ ఇండియా సినిమాలకు శృతి గోల్డెన్ లెగ్!
Shruti Haasan Movies 2024: కెరీర్ స్టార్టింగ్‌లో ఐరన్ లెగ్ అని విమర్శలు పలువురి నుంచి ఎదుర్కొన శృతి హాసన్... ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు గోల్డెన్ లెగ్ అయ్యారు. ఇప్పుడు ఆమె చేతిలో 'సలార్ 2' ఉంది. అది కాకుండా అడివి శేష్ సరసన పాన్ ఇండియా సినిమా 'డెకాయిట్'లో హీరోతో పాటు సమానమైన రోల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలీ'లో కీలకమైన క్యారెక్టర్ చేస్తోంది. 'కేజీఎఫ్' తర్వాత రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్'లో సైతం శృతి హాసన్ హీరోయిన్. ప్రజెంట్ శృతి హాసన్ జోరు చూస్తుంటే... ఇండస్ట్రీలో మరో పదిహేనేళ్ళు విజయాలతో కంటిన్యూ అయ్యేలా ఉంది.

శృతి హాసన్ స్పెషాలిటీ ఏమిటంటే... ఆవిడ జస్ట్‌ హీరోయిన్‌ మాత్రమే కాదు, మాంచి సింగర్‌ కూడా! ఆమె పాటలకు, ఆ గొంతుకు స్పెషల్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. స్టేజి మీద శృతి పెర్ఫార్మెన్స్‌ ఇస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే! రీసెంట్‌ 'భారతీయుడు 2' తమిళ్‌ ఆడియో లాంచ్‌ అందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. కమల్‌ కుమార్తె అయినా సరే సొంతంగా తన కాళ్ల మీద శృతి నడిచారు. కథానాయకగా ఎదిగారు. ప్రతిభ ఉంటే విజయాలు వస్తాయని, పట్టుదల - ఓపికతో వెయిట్‌ చేయాలని చెప్పడానికి ఆవిడ ఒక ఉదాహరణ. ఇతర కథానాయికలకు ఆ విషయంలో స్ఫూర్తి కూడా! ఇప్పటివరకూ ఆవిడ 45కు పైగా సినిమాల్లో నటించింది. ఐదు భాషల్లో నటిగా విజయాలు అందుకున్నారు. ఆవిడ నటి, గాయని, సంగీత కళాకరిణి, బహుముఖ ప్రజ్ఞాశాలి.

Also Readహీరోలను మోసం చేసిన హీరోయిన్లు... గుండెల మీద గట్టిగా కొట్టేశారండీ, మర్చిపోలేం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget