అన్వేషించండి

Love Sitara: డైరెక్ట్ గా ఓటీటీలోకి శోభిత ధూళిపాళ రొమాంటిక్ మూవీ లవ్ సితార- ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ ?

Love Sitara OTT Release Date: నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తరువాత హీరోయిన్ శోభిత ధూళిపాళ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ లవ్ సితార. ఈ ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామా టట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

Shobita Dhulipala movie OTT Release Date: హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రధాన పాత్ర పోషిస్తున్న లవ్ సితార అనే బోల్డ్ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు రెడీ అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ ట్రైలర్ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి. 

లవ్ సితార ట్రైలర్ విశేషాలు 
శోభిత ధూళిపాళ ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ప్రతిరోజూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో లవ్, ఎంగేజ్మెంట్ తర్వాత ఈ బ్యూటీ గురించి ఎలాంటి వార్త వచ్చినా అక్కినేని అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు అడవి శేష్ గూఢచారి సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైంది శోభిత. మారోవైపు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే శోభిత బాలీవుడ్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో హాట్ అండ్ బోల్డ్ గా నటించి అదరగొట్టిన శోభిత ఇప్పుడు లవ్ సితార అంటూ డైరెక్ట్ గా ఓటీటిలో ఎంటర్టైన్ చేయబోతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రెండు నిమిషాల నలభై మూడు సెకండ్ల నిడివి ఉండగా, అందులో లవ్, ఫ్యామిలీ డ్రామా అండ్ రొమాంటిక్ అంశాలన్నీ కలగలిసి ఉన్నట్టుగా చూపించారు. ఇందులో శోభిత ధూళిపాళ ఇంటీరియర్ డిజైనర్ గా, ఇండివిజువల్ భావాలు ఉన్న అమ్మాయిగా నటిస్తోందనే విషయం ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది. కుటుంబంలో సాధారణంగా ఉండే సమస్యలను, వారి ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె పాత్ర పేరు తార. ఇంటర్నేషనల్ చెఫ్ అయిన అర్జున్ తో తార ప్రేమలో పడుతుంది. అయితే పెళ్లి కంటే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇద్దరూ కలిసి తారా ఇంటికి వెళ్తారు. అక్కడ పెళ్లి జరగకముందే తార కుటుంబంలో ఉన్న విభేదాలు, కొన్ని సీక్రెట్స్ బయటపడతాయి. మరి వాటి వల్ల తార, అర్జున్ రిలేషన్ షిప్ లో ఎలాంటి మార్పు వచ్చింది? చివరికి వీరిద్దరి లవ్ స్టోరీ ఎలాంటి టర్న్ తీసుకుంది? అనేది తెరపై చూడాలి. 

Also Read: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తున్న తంగలాన్‌ - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందంటే? 
లవ్ సితార సినిమాలో శోభిత ధూళిపాళతో పాటు రాజీవ్ సిద్ధార్థ, జయశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి వందన కటారియ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆర్ఎస్విపి మూవీస్ బ్యానర్ పై రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.  జీ5 ఒరిజినల్ ఫిలింగా రూపొందిన లవ్ సితార మూవీ సెప్టెంబర్ 27న జీ5 ఓటిటిలోనే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా గురించి ఇటు అక్కినేని అభిమానులతో పాటు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తరువాత శోభిత నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.

Also Read'ది గోట్' రివ్యూ: తండ్రి పాలిట కన్న కొడుకే విలన్ అయితే... విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget