(Source: ECI/ABP News/ABP Majha)
HBD Shivani Rajashekar : శివానీ రాజశేఖర్ బర్త్ డే స్పెషల్.. తెలుగమ్మాయి అయినా అవకాశాలు తక్కువే.. హీరోయిన్ కూతురైనా ఓటీటీకే పరిమితమా?
HBD Shivani Rajashekar: శివానీ రాజశేఖర్.. జీవిత రాజశేఖర్ ల పెద్ద కూతురు. రాజశేఖర్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అంతగా ఛాన్సులు దక్కించుకోలేకపోయింది శివానీ రాజశేఖర్.
Shivani Rajashekar Birthday Today : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు. హీరోల వారసులే కాదు.. ఎంతోమంది దర్శకుల పిల్లల, ప్రొడ్యూసర్ల పిల్లలు, మ్యూజిక్ డైరెక్టర్ల పిల్లలు తమ సత్తా చాటుతున్నారు. అయితే, వారసురాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలా హీరో ఫ్యామిలీ నుంచి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శివానీ రాజశేఖర్. కెరీర్ లో ఎన్నో హిట్లు సాధించి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న జీవిత రాజశేఖర్ దంపతుల సినీ వారసురాలిగా శివానీ రాజశేఖర్ సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు. అయితే, ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి. నిజానికి సక్సెస్ అనే కంటే.. ఆమెకు పెద్దగా తెలుగులో ఛాన్సులు రాలేదు. తెలుగింటి అమ్మాయి, తెలుగు హీరో కూతురు అయినప్పటికీ ఆమెకు ఛాన్సులు తమిళంలో ఎక్కువగా తలుపుతట్టాయి. ఇక తెలుగులో చేసిన అన్ని సినిమాల్లో కేవలం ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. జులై 1న శివానీ రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ఆమెపై స్పెషల్ స్టోరీ.
మొదటి సినిమాకే బ్రేక్..
జీవితా రాజశేఖర్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్. ఇద్దరు పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటికీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయారు. శివానీ రాజశేఖర్ జీవిత రాజశేఖర్ పెద్ద కూతరు. 2018లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శివానీ రాజశేఖర్. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన '2స్టేట్స్' సినిమా తెలుగు రీమేక్ లో శివానీ రాజశేఖర్ ని ఎంపిక చేశారు. అడవి శేష్ హీరోగా సినిమాని ప్రారంభించి కొంత షూటింగ్ కూడా పూర్తైన తర్వాత.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో శివానికి మొదటి సినిమానే బ్రేక్ పడింది. ఆ తర్వాత కూడా ఆమెకు అనుకున్నన్ని ఛాన్సులు రాలేదు.
తెలుగులో కంటే తమిళంలోనే..
శివానీ రాజశేఖర్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. ఆమెకు తెలుగులో అనుకున్న అవకాశాలు రాలేదు. '2 స్టేట్స్' రీమేక్ అయిన తర్వాత.. తమిళంలో ఒక సినిమా చేసిన శివానీ.. ఆ తర్వాత తెలుగులో తేజ సజ్జతో కలిసి 'అద్భుతం' అనే సినిమాలో చేశారు. ఆ తర్వాత 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ', 'అన్బరివు', 'నెంజుక్కు నీతి', 'శేఖర్', 'కోట బొమ్మాళి పీ.ఎస్' సినిమాలో నటించింది. ఇన్ని సినిమాల్లో కేవలం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ', 'శేఖర్', 'కోట బొమ్మాళి పీ.ఎస్' మాత్రమే తెలుగు సినిమాలు. మిగతావన్నీ తమిళం సినిమాలే. ఈ మధ్యే ఆమె నటించిన విద్యా వాసుల అహుం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
థియేటర్ లో రిలీజ్ అయ్యింది ఒక్కటే..
శివానీ నటించిన తెలుగు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయ్యింది. 'అద్భుతం' సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా, థియేటర్లు తెరుచుకోకపోవడంతో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' కూడా సోనీ లైవ్ లో రిలీజ్ అయ్యింది. డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా 'కోట బొమ్మాళి పీ.ఎస్.' ఈ సినిమా మలయాళం రీమేక్ కాగా.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 'కోటబొమ్మాళి' సినిమాలో శివానీ కానిస్టేబుల్ పాత్రలో నటించారు. ఇక శివానీ చెల్లెలు శివాత్మిక రాజశేఖర్ కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ కాలేకపోయారు. ఏదేమైనా.. తెలుగమ్మాయి శివానీకి ఈ ఏడాది మంచి ఆఫర్లు రావాలని, ఆమెకు స్పెషల్ విషెస్ చెప్తోంది ఏబీపీ. హ్యాపీ బర్త్ డే శివానీ.
Also Read: 'నాకు ఇష్టమైన వాళ్ల కోసం ఈ సినిమా చేశాను'.. అర్జునుడి పాత్రపై దేవరకొండ రియాక్షన్