అన్వేషించండి

Vijay Devarakonda: 'నాకు ఇష్ట‌మైన వాళ్ల కోసం ఈ సినిమా చేశాను'.. అర్జునుడి పాత్ర‌పై దేవ‌ర‌కొండ‌ రియాక్ష‌న్

Vijay Devarakonda : 'క‌ల్కీ 2898 ఏడీ'లో అర్జునుడి పాత్ర చేయ‌డంపై విజ‌యదేవ‌ర‌కొండ రియాక్ట్ అయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఆ పాత్ర త‌న‌కు ఇష్ట‌మైన వాళ్ల కోసం చేశాను అని అంటున్నాడు.

Vijay Devarakonda About His Role In kalki 2898 AD : 'క‌ల్కీ 2898 ఏడీ'.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా, ఎవ‌రు నోట విన్నా ఈ సినిమా గురించే. సినిమాలో ఉన్న గ్రాఫిక్స్, ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా పడుకోణె, క‌మ‌ల్ హాస‌న్ త‌దిత‌రుల యాక్టింగ్ గురించే చ‌ర్చ‌. అయితే, వీళ్ల‌తో పాటు సినిమాలో ఇత‌ర న‌టులు క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేశారు. వాళ్ల‌లో దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, ఆర్జీవీ, ఫ‌రియా అబ్దుల్లా త‌దిత‌రులు ఉన్నారు. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ రౌడీబాయ్ విజ‌య దేవ‌ర‌కొండ అర్జునుడి పాత్ర‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అయితే, ఆ పాత్ర చేయ‌డంపై ఆయ‌న మొద‌టిసారి స్పందించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. 

'నాకు ఇష్ట‌మైన వాళ్ల కోస‌మే..' 

అర్జునుడి పాత్ర చేయ‌డంపై ఎలా అనిపిస్తుంది?  ప్ర‌భాస్ తో క‌లిసి చేయ‌డంపై ఎలా అనిపిస్తుంది అనే ప్ర‌శ్న‌ల‌కి ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. "నాకు చాలా సంతోషంగా ఉంది. అంత‌పెద్ద సినిమాలో చేయ‌డం. నిన్న సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. చాలా ఎమోష‌న‌ల్ గా అనిపించింది. మ‌న తెలుగు సినిమా, మ‌న ఇండియ‌న్ సినిమాని ఎక్క‌డికో తీసుకెళ్లిపొయినం. ఆ సినిమాలో చేయ‌డం చాలా తృప్తిగా అనిపించింది. లాస్ట్ లో ఆ చిన్న క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా చాలా తృప్తినిచ్చింది" అని చెప్పాడు విజ‌య్. ప్ర‌భాస్ ముందు ఆయ‌నతో ఫైట్ చేయ‌డం అనే సీన్లు ఎలా అనిపించింది? "అక్క‌డ ప్ర‌భాస్ అన్న నేను అని కాదు. అర్జునుడు, క‌ర్ణుడు మ‌ధ్య యుద్ధం. నాగి గారి యూనివ‌ర్స్ లో ఒక పాత్ర పోషించాను. అంద‌రూ మ‌నుషుల‌మే. వాళ్లంద‌రి గురించి చేశాను. వాళ్లంద‌రూ నాకు చాలా ఇష్టం. నాగి, ప్ర‌భాస్ అన్న‌, బ‌చ్చ‌న్ గారు, దీపికా వాళ్ల కోస‌మే ఈ సినిమాలో చేశాను. వైజ‌యంతి మూవీస్ లో కెరీర్ స్టార్ట్ చేశాను.  అలాంటి వాళ్ల‌తో సినిమా చేయ‌డం బాగా అనిపించింది. నేను ల‌క్కీ ఛామ్ అని నాగి అనుకుంటాడు. కానీ అలా ఏమీ లేదు. నాగి పిలుస్తున్నాడు నేను చేస్తున్నాను అంతే. మ‌హాన‌టి నా వ‌ల్ల హిట్ అయ్యింది కాదు. అది సావిత్ర గారి మీద తీసిన సినిమా" అని అన్నాడు రౌడీ బాయ్. 

అర్జునుడిగా.. 

నాగ్ అశ్విన్, ప్ర‌భాస్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా 'క‌ల్కీ 2898 ఏడీ'. ఈసినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపికా ప‌దుకునే త‌దిత‌రులు ముఖ్య పాత్ర పోషించారు. వైజ‌యంతి మూవీస్ సినిమాని ప్రొడ్యూస్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన ఈ పాన్ ఇండియా సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలో దూసుకుపోతుంది. ఇక ఈసినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న ద‌ర్శ‌కుడు ఎక్క‌డా కూడా మిగ‌తా పాత్ర‌ల గురించి లీక్ అవ్వ‌కుండా చూసుకున్నారు. అలా అర్జునుడిగా విజ‌య దేవ‌ర‌కొండ చేసిన విష‌యం ఎక్క‌డా బ‌య‌టికి రాకుండా క్లైమాక్స్ లో రివీల్ చేసి అంద‌రినీ స‌ర్ ప్రైజ్ చేశాడు. ఇక నాగ్ అశ్విన్ తీసిన ప్ర‌తి సినిమాలో దాదాప విజ‌య దేవ‌ర‌కొండ ఉంటాడు. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాతో మొద‌లైంది ఇద్ద‌రి జ‌ర్నీ. ఆ త‌ర్వాత మ‌హాన‌టి సినిమాలో కూడా ప్ర‌ధాన పాత్ర పోషించాడు విజ‌య దేవ‌ర‌కొండ‌. 

Also Read: కూతురి పెళ్లైన కొద్దిరోజుల‌కే ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు.. వివరాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 4 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 4 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
Shakti App:  దిశ వేస్ట్.. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన
దిశ వేస్ట్ .. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన
Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RS Praveen Kumar Tweet Controversy Sunil Kumar IPS | ఒక్క ట్వీట్ తో తేనె తుట్టను కదిపిన RS ప్రవీణ్Ind vs Aus Match Highlights | Champions Trophy 2025 ఫైనల్ కు చేరుకున్న టీమిండియా | ABP DesamPM Modi inaugurates Vantara | అంబానీల జంతు పరిరక్షణ కేంద్రం 'వంతారా' ను ప్రారంభించిన ప్రధాని మోదీInd vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 4 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 4 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
Shakti App:  దిశ వేస్ట్.. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన
దిశ వేస్ట్ .. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన
Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Nabha Natesh: 'కల్కి 2898 ఏడీ' హీరోయిన్ దిశాకు పోటీ ఇచ్చేలా... Calvin Klein ఇన్నర్ వేర్‌లో నభా నటేష్
'కల్కి 2898 ఏడీ' హీరోయిన్ దిశాకు పోటీ ఇచ్చేలా... Calvin Klein ఇన్నర్ వేర్‌లో నభా నటేష్
DVV Danayya Daughter Jahnavi: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
Kohli Record: కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు.. ఒకే రోజు ఫీల్డ‌ర్ గా రెండు ఘ‌న‌త‌లు.. రోహిత్ ప్ర‌పంచ రికార్డు
కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు.. ఒకే రోజు ఫీల్డ‌ర్ గా రెండు ఘ‌న‌త‌లు.. రోహిత్ ప్ర‌పంచ రికార్డు
Embed widget