అన్వేషించండి

Shiva Re Release: నవంబర్‌లో 'శివ' రీ రిలీజ్... నాగార్జున కల్ట్ క్లాసిక్ మళ్ళీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?

Nagarjuna's Shiva Re Release: ఏయన్నార్ జయంతి సందర్భంగా 'శివ' రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. ఆయన నటించిన కల్ట్ క్లాసిక్ మళ్ళీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?

సెప్టెంబర్ 20... అక్కినేని నాగేశ్వరరావు జయంతి (Akkineni Nageswara Rao Birth Anniversary). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'శివ' సినిమా రీ రిలీజ్ (Shiva Re Release Date) అనౌన్స్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna). సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆయన చేసిన మొదటి సినిమా, కల్ట్ క్లాసిక్ 'శివ' మళ్ళీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?

నవంబర్ 14న 'శివ' రీ రిలీజ్!
ఏయన్నార్ 101వ జయంతి సందర్భంగా నవంబర్ 14న 'శివ' సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున తెలిపారు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుతూ... ''తరాలు మారినా తెరపై చెరగని ముద్ర వేసే శక్తి సినిమాకు ఉందని మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. తరాలకు అతీతంగా జీవించే శక్తి సినిమాకు ఉందని ఆయన అనేవారు. అటువంటి సినిమాల్లో శివ ఒకటి. నవంబర్ 14న 4కే డాల్బీ ఎట్మాస్ లో విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.

Also Readదక్ష రివ్యూ: సన్నాఫ్ ఇండియా దర్శకుడి కథతో... మోహన్ బాబు - లక్ష్మీ మంచు సినిమా... మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

'శివ'కు ముందు, తర్వాత...
తెలుగు సినిమా ప్రయాణాన్ని మార్చిన సినిమాల్లో 'శివ'ది ప్రత్యేక స్థానం. 'శివ'కు ముందు, 'శివ'కు తర్వాత అనేలా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మార్చిన ఘనత రామ్ గోపాల్ వర్మది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో ఏయన్నార్ పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. దర్శకుడిగా పరిచయమైన సినిమాతో రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్న తరుణంలో సౌండ్ మీద మరింత వర్క్ చేశారట. ఈసారి థియేటర్లలో సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని యూనిట్ చెబుతోంది.

Also Readతెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!

అక్కినేని నాగార్జున ఈ ఏడాది రెండు భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. ఓ ప్రధాన పాత్రలో ఆయన నటించిన 'కుబేర' వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రతినాయకుడిగా నటించిన 'కూలీ' 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు ధీటైన విలనిజం చూపించిన నాగార్జున నటన తెలుగు, తమిళ ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget