Jailer 2 - Balakrishna: 'జైలర్ 2'లో బాలకృష్ణ... రజనీకాంత్ సినిమా గురించి శివన్న ఏం చెప్పారంటే?
Shiva Rajkumar On Jailer 2: కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ హీరోగా నటించిన '45' తెలుగు టీజర్ విడుదల కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిలిం 'జైలర్'లో కన్నడ స్టార్ - కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, హిందీ నటుడు జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో సందడి చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna)ను సైతం ఒక పాత్రకు సంప్రదించామని, అయితే అప్పట్లో కుదరలేదని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెలిపారు. ఇప్పుడు 'జైలర్ 2' (Jailer 2 Movie) సెట్స్ మీద ఉంది. మరి, ఇందులో బాలయ్య నటిస్తున్నారా? ఆయన క్యారెక్టర్ గురించి శివన్న ఏం చెప్పారంటే?
మా నాన్నను చిక్కప్ప అని బాలయ్య పిలుస్తారు!
శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన '45' సినిమా (45 Movie) తెలుగు టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ సందర్భంగా 'జైలర్ 2' ప్రస్తావన వచ్చింది.
''బాలకృష్ణ కూడా 'జైలర్' సినిమాలో నటించాల్సిందని నెల్సన్ అప్పట్లో చెప్పారు. ఇప్పుడు మీరిద్దరూ 'జైలర్ 2'లో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంత?'' అని ప్రశ్నించగా... ''నిజమా? నాకు తెలియదు. 'జైలర్ 2'లో నేను ఉన్నానని నెల్సన్ చెప్పాడు. బాలకృష్ణ గారి గురించి అయితే ఐడియా లేదు. బాలయ్య వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో నేను ఒక పాటలో కనిపించాను. అయితే మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే చాలా సంతోషం. మేమిద్దరం చాలా క్లోజ్. బాలకృష్ణ మా ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్. మా నాన్న (రాజ్ కుమార్) గారిని 'చిక్కప్ప' (అంటే తెలుగులో చిన్నాన్న) అని బాలకృష్ణ పిలుస్తారు. మేమిద్దరం ఫోనులో మాట్లాడుకుంటూ ఉంటాం. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో కార్యక్రమాలకు సైతం నేను హాజరయ్యాను'' అని శివరాజ్ కుమార్ చెప్పారు.
Also Read: సనాతన ధర్మం నేపథ్యంలో శివన్న, ఉపేంద్ర సినిమా '45' - తెలుగులోనూ టీజర్ విడుదల
టిష్యూ ఇంత పెద్ద ఇష్యూ అవుతుందనుకోలేదు...
'జైలర్'లో నువ్వేం చేసావని ఇప్పటికీ అడుగుతోంది!
'జైలర్' సినిమాలో తాను రెండు సన్నివేశాలలో మాత్రమే కనిపిస్తానని, అయితే ఆ రెండిటికీ అంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదని శివరాజ్ కుమార్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''రజనీకాంత్ నాకు తండ్రి లాంటి వారు. ఆయన సినిమాలో ఒక్క సీన్ చేసే అవకాశం వచ్చినా నాకు చాలు. డాషింగ్ షాట్ ఉన్నా చేసేస్తానని చెప్పాను. కథ కూడా అడగలేదు. అయితే దర్శకుడు నెల్సన్ వచ్చి కథ చెప్పారు. సినిమా చేశాను. విడుదలైన తరువాత ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. నా క్యారెక్టర్ చాలా బాగుందని అప్రిషియేట్ చేసిన జనాలు ఎంతో మంది ఉన్నారు. మా ఆవిడ అయితే ఇప్పటికీ అడుగుతుంటుంది... 'సిగరెట్ పట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చావు జైలర్‌లో. అసలు నువ్వు ఏం చేశావు' అంటుంది. నాక్కూడా తెలియదు ఏం చేశానో... 'జైలర్ 2' షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలో నేను జాయిన్ అవుతాను'' అని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

