Shiva Re Release Trailer: అప్పట్లో మీ పేరెంట్స్ చూసుంటారు... ఇప్పుడు మీకూ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది - 'శివ' రీ రిలీజ్‌పై నాగార్జున
Shiva Re Release Date: నవంబర్ 14న 'శివ' రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కొత్త ట్రైలర్ విడుదల చేశారు. అందులో నాగార్జున, రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. వాళ్లిద్దరూ ఏమన్నారంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మార్చిన సినిమా 'శివ'. కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించిన చిత్రమిది. తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ సినిమా ఇది. అప్పట్లో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసింది. 'శివ'కు ముందు, 'శివ' తర్వాత అనేలా తెలుగు సినిమాను మార్చింది. ఇప్పుడీ సినిమా నవంబర్ 14న మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కొత్త ట్రైలర్ విడుదల చేశారు.
అన్నపూర్ణ @ 50... 'శివ' రీ రిలీజ్!
అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 'శివ' చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ టెక్నాలిజీతో అప్‌గ్రేడ్ చేసి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అభిమానుల సమక్షంలో ట్రైలర్ విడుదల చేశారు.
అప్పట్లో మీ పేరెంట్స్ చూసి ఉంటారు...
ఇప్పుడూ మీకు గూస్ బంప్స్ ఇస్తుంది!
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ... ''ఈ సినిమాను అప్పట్లో మీ పేరెంట్స్ థియేటర్లలో చూసుంటారు. ఈ సినిమాతో 36 ఏళ్ల క్రితం నన్ను పెద్ద స్టార్ చేశాడు వర్మ. ఇవాళ ఉదయం మళ్ళీ సినిమా చూశా. స్టన్నింగ్ ఫీల్ వచ్చింది. రాము దాదాపు 6 నెలలు చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్లు, ఒక మైల్ స్టోన్ మూవీగా అద్భుతంగా డిజైన్ చేశాడు. ఇప్పటికీ అంతే స్టన్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమా చూశాక... ఇప్పుడు ఎందుకు ఇటువంటి సౌండ్ డిజైన్‌తో నేను చేస్తున్న సినిమాలు రావడం లేదని అనిపించింది. డాల్బీ ఆట్మాస్‌లో 'శివ' రియల్లీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నవంబర్ 14న మీరందరూ 'శివ'ని కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. రాజమౌళి అన్నట్టు 'శివ'కు ముందు, 'శివ'కు తర్వాత అనేలా ఈ సినిమా గుర్తు ఉంటుంది'' అని అన్నారు.
Also Read: ఎవరీ పవన్ కళ్యాణ్? ఏమిటీ పురుషః? భర్త పోరాటం ఎందుకు?
30 ఏళ్ళ తర్వాత మళ్ళీ... ఊహించలేదు!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ''మేం 36 ఏళ్ల క్రితం తీసిన సినిమా 'శివ'. ఇన్నేళ్ల తర్వాత మేమిద్దరం ఒకే స్టేజిపై ఇలా మీ ముందు రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి మాట్లాడతామని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది వెరీ గ్రేట్ ఫీలింగ్. విజువల్, సౌండ్ పరంగా అప్పట్లో నాగార్జున నాకు చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ రోజు కూడా అంతే ఫ్రీడమ్ ఇచ్చారు. రీ రిలీజ్ కోసం సౌండ్ / నేపథ్య సంగీతాన్ని బెటర్ గా డిజైన్ చేశాం. కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. చిరంజీవి గారు చెప్పినట్టు సినిమా ఉన్నంత వరకు శివ 'చిరంజీవి'లా చిరస్మరణీయంగా ఉంటుంది'' అని అన్నారు.
Also Read: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారంటే?





















