అన్వేషించండి

Sharwanand: రామ్ చరణ్, రానా పెద్ద రౌడీలు - శర్వానంద్ కామెంట్స్

Sharwanand: శర్వానంద్, రామ్ చరణ్, రానా కలిసి చిన్నప్పుడు ఒకే స్కూల్‌లో చదివారు. అప్పటినుండి ఇప్పటివరకు వీరి స్నేహం అలాగే ఉంది. ఇక తాజాగా ఆ ఇద్దరు హీరోలపై శర్వానంద్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Sharwanand about Ram Charan and Rana: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. చాలావరకు ఇండస్ట్రీలోని ఇతర హీరోలతో సన్నిహితంగా ఉంటారు. ఇక రానా కూడా ఏ హీరోకు ఏ సాయం కావాలన్నా ముందుంటాడు. ఈ రానా, రామ్ చరణ్‌ల ఫ్రెండ్‌షిప్ ఇప్పటిది కాదు.. వీరిద్దరూ చిన్నప్పుడు కలిసే చదువుకున్నారు. ఇరువురివి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబాలు కావడంతో అలా కూడా వీరికి బాగా ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ఇక రానా మాత్రమే కాకుండా రామ్ చరణ్.. యంగ్ హీరో శర్వానంద్‌తో కూడా చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఇక శర్వానంద్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇంటర్వ్యూ పాతదే అయినా శర్వానంద్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ చాలా స్పెషల్..

సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా సందర్భాల్లో రామ్ చరణ్ తనకు తోడుగా ఉన్నాడని శర్వానంద్ ఇప్పటికే పలుమార్లు బయటపెట్టాడు. అందుకే తన పెళ్లి కేవలం సన్నిహితుల మధ్యలోనే జరిగినా.. దానికి ఇండస్ట్రీ నుండి ఎవరినీ పిలవకపోయినా.. రామ్ చరణ్‌ను మాత్రం స్పెషల్‌గా పిలిచాడు శర్వా. రామ్ చరణ్, రానా, శర్వానంద్.. ఈ ముగ్గురు చిన్నప్పుడు కలిసే చదువుకున్నారు. అయితే తన చిన్నప్పటి విషయాలను గుర్తుచేసుకుంటూ శర్వానంద్.. తనెప్పుడూ సరిగా క్లాసులకు వెళ్లేవాడు కాదని బయటపెట్టాడు. కొంచెం రౌడీలాగా ఉండేవాడినని అన్నాడు. తనకంటే పెద్ద రౌడీ బాయ్స్ ఉన్నారని రామ్ చరణ్, రానాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లీష్ కోసం ట్యూషన్..

రామ్ చరణ్, రానా రౌడీలే అయినా కూడా చాలా బ్రైట్ స్టూడెంట్స్ అని శర్వానంద్ ఫన్నీగా కామెంట్స్ చేశాడు. స్కూలులో చదవడం మాత్రమే కాకుండా వారంతా కలిసి ట్యూషన్‌కు కూడా వెళ్లేవాళ్లమని అన్నాడు. అప్పట్లో వారిని ఇంగ్లీష్ ట్యూషన్‌ను పంపించేవారని చెప్పి నవ్వాడు. అలా తన పాత ఇంటర్వ్యూలో రామ్ చరణ్, రానాతో ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నాడు శర్వానంద్. ప్రస్తుతం ఈ ముగ్గురు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరోలు అయిపోయారు. రామ్ చరణ్ అయితే ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. రానా కూడా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపును సాధించుకున్నాడు.

లక్ కలిసిరాలేదు..

శర్వానంద్ మాత్రం టైర్ 2 హీరోగా సెటిల్ అయిపోయాడు. మీడియం బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ తన లక్‌ను పరీక్షించుకుంటున్నాడు ఈ హీరో. అప్పుడప్పుడు వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. తనకు లక్ కలిసి రాక పలు సినిమాలు ఫ్లాప్‌గానే నిలిచాయి. 2022లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, ‘ఒకే ఒక జీవితం’లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు శర్వా. ఈ మూవీస్ విడుదలయ్యి రెండేళ్లు అయిపోతున్నా తన తరువాతి మూవీపై పూర్తిగా క్లారిటీ లేదు. ఇక తన కెరీర్‌లోని 35వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో చేయాలని శర్వానంద్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అప్డేట్ రాలేదు.

Also Read: భార్య కోసం మెగాస్టార్ చిరు కవిత - సోషల్ మీడియాలో వైరల్

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget