Chiranjeevi: భార్య కోసం మెగాస్టార్ చిరు కవిత - సోషల్ మీడియాలో వైరల్
Chiranjeevi Wife Surekha: మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టిరోజు సందర్భంగా ఒక చిరు కవితతో ఆమెకు బర్త్‌డే విషెస్ తెలిపారు. స్పెషల్ ఫోటోతో షేర్ చేసిన ఈ కవిత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Chiranjeevi Wife Surekha Birthday: మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. తన సమయాన్ని ఎక్కువగా సెట్స్‌లోనే గడిపేస్తుంటారు. కానీ ఫ్యామిలీకి కూడా తన సమయాన్ని కేటాయిస్తారు. అలా చిరంజీవి.. తన ఫ్యామిలీతో షేర్ చేసుకునే స్పెషల్ మూమెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో బయటపెడుతుంటారు. తాజాగా తన భార్య సురేఖకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్‌ను తెలిపారు చిరు. ఒక చిన్న కవితతో భార్య సురేఖకు బర్త్ డే విషెస్ చెప్తూ.. మెగాస్టార్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. కవితతో పాటు తన భార్యతో దిగిన స్పెషల్ ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు..
‘నా జీవన రేఖ. నా సౌభాగ్య రేఖ. నా భాగస్వామి సురేఖ’ అంటూ తన భార్య సురేఖ గురించి చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ‘నా లైఫ్‌లైన్, నా బలం సురేఖకు హ్యాపీ బర్త్‌డే’ అని ఆమెకు బర్త్‌డే విషెస్ తెలిపారు. భార్య సురేఖ గురించి చిరంజీవి స్పెషల్ పోస్టులు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. సందర్భం దొరికినప్పుడల్లా తన సురేఖపై ఉన్న ప్రేమను సోషల్ మీడియాలో బయటపెడుతూనే ఉంటారు చిరు. ఇక తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిరు కవిత రాయడంతో ఫ్యాన్స్ అంతా చాలా ముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నా జీవన రేఖ
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2024
నా సౌభాగ్య రేఖ
నా భాగస్వామి సురేఖ !
Happy Birthday to my lifeline and the greatest pillar of my strength Surekha !
Many Many Happy Returns!💐❤️ pic.twitter.com/JcABQQ1Aey
షార్ట్ ట్రిప్స్..
ఈమధ్య ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా వెకేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. ముఖ్యంగా తనకు షూటింగ్స్ నుండి బ్రేక్ దొరికిన ప్రతీసారి భార్యతో కలిసి ఒక ట్రిప్‌కు వెళ్లి వస్తున్నారు. అలా వాలెంటైన్స్ డే సందర్బంగా భార్య సురేఖతో అమెరికాకు వెళ్లారు చిరు. ఆ విషయాన్ని కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. భార్య సురేఖతో షార్ట్ ట్రిప్ అంటూ ఫ్లైట్‌లో ఇద్దరు దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అలా ప్రతీ సినిమా పూర్తయిన తర్వాత అయినా.. లేదా సినిమా షూటింగ్స్ నుండి బ్రేక్ దొరికినప్పుడు అయినా.. ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతూ ఆ స్పెషల్ మూమెంట్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చిరు. దీన్ని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీలో ఉన్న యంగ్ హీరోలకంటే సీనియర్ హీరో మెగాస్టారే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషియో ఫాంటసీ కథతో..
ప్రస్తుతం చిరంజీవి.. ‘విశ్వంభర’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం భారీ వర్కవుట్స్ చేస్తూ.. దానిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరు. ఈ వర్కవుట్ వీడియో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ హీరో అయినా కూడా సినిమా కోసం ఇంతగా కష్టపడి వర్కవుట్స్ చేయడం గ్రేట్ అంటూ అందరూ ఆయనను ప్రశంసించారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్నో ఏళ్ల తర్వాత త్రిషతో జోడీకట్టనున్నారు చిరంజీవి.
Also Read: ఒకప్పటి హీరోయిన్ - ఇప్పుడు కార్తీ చెల్లిగా