Shalini Pandey: ఆ సీన్ చేస్తున్నప్పుడు భయపడ్డాను, బయటికి పారిపోయాను - షాలిని పాండే
Shalini Pandey: టాలీవుడ్‌లో సక్సెస్‌తో పాటు ఛాన్సులు కూడా రాకపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది షాలిని పాండే. తాజాగా తను నటించిన ‘మహారాజ్’ సినిమాలో ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఎంత భయపడిందో బయటపెట్టింది
Shalini Pandey About Maharaj Movie: టాలీవుడ్‌లో సక్సెస్ సాధించిన తర్వాత చాలామంది నటీమణులు ఇతర భాషా ఇండస్ట్రీలపై ఫోకస్ పెడతారు. అలాంటివారి లిస్ట్‌లో షాలిని పాండే కూడా చేరింది. ఇప్పటికీ షాలిని పాండే అంటే ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్‌గానే గుర్తిస్తారు ప్రేక్షకులు. దాని తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించినా అవేవి తనకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అందుకే బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యింది. తాజాగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ‘మహారాజ్’తో మరోసారి బీ టౌన్ ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ మూవీలోని రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు తన ఎక్స్‌పీరియన్స్ ఏంటో ప్రేక్షకులతో పంచుకుంది.
కిషోరి పాత్రలో..
అమీర్ ఖాన్ కుమారుడి సినీ ఎంట్రీ చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. పైగా జునైద్ ఖాన్ మొదటి సినిమా అయిన ‘మహారాజ్’ను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేశారు. ‘మహారాజ్’లో విలన్‌గా జైదీప్ అహ్లావత్ కనిపించారు. ఇందులో మహారాజ్‌గా కనిపిస్తూ స్వామిజీలాగా వేషం వేసుకొని అందరినీ మోసం చేస్తుంటారు. అదే విధంగా కిషోరి పాత్రలో కనిపించే షాలిని పాండేను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. సేవ పేరుతో తన దగ్గరికి వచ్చే ఆడవారిని రేప్ చేస్తుంటారు జైదీప్. అలాగే షాలిని పాండేతో కూడా ‘చరణ్ సేవ’ అనే ఒక రేప్ సీన్ ఉంటుంది. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు తను ఎంతగా భయపడిందో తాజాగా బయటపెట్టింది ఈ భామ.
గాలి పీల్చుకోవాలి..
‘‘మహారాజ్‌లో చరణ్ సేవ సీన్ చేసేవరకు అది నామీద ఎంత ఇంపాక్ట్ చూపించిందో నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా నేను బయటికి వెళ్లిపోయాను. మూసేసిన గదిలో ఉండలేనని చెప్పేశాను. నాకు కొంచెం సమయం కావాలి, కాస్త గాలి పీల్చుకోవాలి భయంగా ఉందని అన్నాను. మా డైరెక్టర్ సిద్ధార్థ్ పీ మల్హోత్రాతో పాటు నా కో యాక్టర్ జైదీప్ కూడా నా పరిస్థితి అర్థం చేసుకున్నారు’’ అని ఆరోజు షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుంది షాలిని పాండే. అంతే కాకుండా కిషోరి పాత్ర గురించి చెప్తూ.. ‘‘కిషోరి పాత్ర పోషించడం చాలా బాగుంది’’ అని చెప్పుకొచ్చింది.
చాలా స్టుపిడ్..
‘‘నేను ముందుగా కిషోరి పాత్ర గురించి చదివినప్పుడు ఇది చాలా స్టూపిడ్ అనుకున్నాను. కానీ తర్వాత తను స్టుపిడ్ కాదని అర్థం చేసుకున్నాను. తనకు అంతకంటే ఏమీ తెలియదు. తను చేసే ప్రతీ విషయం నిజమని నమ్మే కచ్చితమైన వ్యక్తి. మనం ఫీల్ అయ్యి ఆ పాత్రలో నటించి, ఆ తర్వాత దాని గురించి ఆలోచించినప్పుడు అది మనల్ని చాలా బాధపెడుతుంది. అప్పుడు తను స్టుపిడ్ కాదని మనకు అర్థమవుతుంది. తనకు ఇలా జరుగుతుందని ముందే తెలిసుంటే బాగుండేది’’ అని తెలిపింది షాలిని పాండే. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘మహారాజ్’.. 1800ల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. యాక్టర్ల పర్ఫార్మెన్స్ బాగుండడంతో మూవీకి మంచి రివ్యూలు అందుతున్నాయి.
Also Read: సమంత కొత్త వెబ్ సిరీస్... హిట్ కాంబినేషన్‌లో మూడోది, టైటిల్ ఏంటో తెలుసా?