Pooja Dadlani: షారుక్ మేనేజర్ జీతం అన్ని కోట్లా! స్టార్ హీరోయిన్లను మించిన సంపాదన!
Pooja Dadlani Salary: షారుఖ్ మేనేజర్ గా పనిచేసే పూజా దద్లానీ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. ఏకంగా కోట్లలోనే...

బాలీవుడ్ కింగ్ ఖాన్ తో ఓ వ్యక్తి ఎప్పుడూ కనిపిస్తారు. షారుఖ్ తో పాటు ఉండటం.. తన ప్రతి పనిని చూసుకోవడం వరకు అన్నీ మేనేజర్ చూసుకుంటుంది. ఆమె పేరు పేరు పూజా దద్లానీ. షూరుక్ కి పూజా కేవలం మేనేజర్ మాత్రమే కాదు.. కుటుంబ సభ్యురాలు లాంటిది. ఆ కుటుంబానికి అంతలా దగ్గరైంది పూజా దద్లానీ. షారుక్ ఖాన్ పిల్లలతోనూ పూజా దద్లానీ కనిపిస్తుంటుంది. 2021లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పూజా కీలక పాత్ర పోషించింది, కోర్టు విచారణల్లో ... ఇతర చట్టపరమైన పనుల్లో ఆ కుటుంబానికి మద్దతుగా నిలబడింది. షారుక్ ఖాన్ దగ్గర మేనేజర్ గా పనిచేసేందుకు పూడా దద్లానీ ఏడాదికి కోట్లతో జీతం తీసుకుంటోంది. ఆమె జీతం, నెట్ వర్త్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గ్లామర్ ప్రపంచంలో మంచి పేరుంది. ఆమె సినిమాల్లో కనిపించకపోయినా ఆమెను చాలా మంది అనుసరిస్తారు. పూజా షారుఖ్ ఖాన్ ప్రతి రూపాయిని కూడా లెక్కిస్తుంది..తన అవకాశాల నుంచి డేట్స్ కేటాయించడం వరకూ ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఇందుకోసం షారుఖ్ ఆమెకు మంచి జీతం ఇస్తాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ పూజా దద్లానీకి సంవత్సరానికి 7-9 కోట్ల జీతం ఇస్తాడు. పూజా నెట్ వర్త్ గురించి మాట్లాడితే, అది 45-50 కోట్ల మధ్య ఉంటుంది. పూజా దద్లానీ నెట్ వర్త్ ఏ బాలీవుడ్ నటి కంటే తక్కువ కాదు.
గౌరీ ఇల్లు డిజైన్ చేసింది
పూజా దద్లానీ తన కుటుంబంతో ముంబైలోని బాంద్రాలో నివసిస్తుంది. ఆమెకు ఒక లగ్జరీ ఇల్లు ఉంది. దీనిని స్వయంగా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేసి ఇచ్చింది. నివేదికల ప్రకారం పూజా ఇంటి విలువ కోట్లలో ఉంది. పూజా 2008లో లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని వివాహం చేసుకుంది. వీరికి రేనా గుర్నానీ అనే కుమార్తె ఉంది.
View this post on Instagram
1983 నవంబర్ 2న ముంబైలో జన్మించిన ఆమె పూర్తి పేరు పూజా దద్లానీ గుర్నానీ. ముంబైలోని బాయి అవబాయ్ ఫ్రామ్జీ పెటిట్ గర్ల్స్ హై స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసి ఆ తర్వాత హెచ్‌ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.
పూజా షారుఖ్ ఖాన్‌తో పాటు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలతో సామాజిక కార్యక్రమాలు మరియు ఈవెంట్‌లలో కనిపిస్తుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది, తన కుటుంబం షారుఖ్ ఖాన్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని తరచూ అభిమానులతో పంచుకుంటుంది.
ఈ మధ్య పూజా దద్లానీ అత్తగారు మరణించారు. పూజా తన అత్తగారి కోసం ప్రార్థన సభను ఏర్పాటు చేసింది, ఇందులో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.






















