Shah Rukh Khan: తన ఫ్యామిలీకి షారుఖ్ ఎమోషనల్ ప్రామిస్ - నేను బతికి ఉండేవరకు.. అంటూ బాద్‌షా భావోద్వేగం
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌ను ఫ్యామిలీ మ్యాన్ అని అంటుంటారు ఫ్యాన్స్. మరోసారి ఇదే విషయాన్ని నిరూపించారు ఈ హీరో. ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తర్వాత స్టేజ్‌పై తన ఫ్యామిలీకి ఒక మాటిచ్చారు.
![Shah Rukh Khan: తన ఫ్యామిలీకి షారుఖ్ ఎమోషనల్ ప్రామిస్ - నేను బతికి ఉండేవరకు.. అంటూ బాద్‌షా భావోద్వేగం Shah Rukh Khan makes a promise to his family after receiving best actor in zee cine awards 2024 Shah Rukh Khan: తన ఫ్యామిలీకి షారుఖ్ ఎమోషనల్ ప్రామిస్ - నేను బతికి ఉండేవరకు.. అంటూ బాద్‌షా భావోద్వేగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/14/7b7d52abc418dc9df766a82e1227793d1710390828691802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shah Rukh Khan Speech at Zee Cine Awards 2024: దాదాపు మూడు దశాబ్దాల నుండి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు షారుఖ్. కానీ గత కొన్నేళ్లుగా ఈ హీరోకు కావాల్సిన హిట్ దక్కలేదు. 2023 మాత్రం తనకు కమ్ బ్యాక్ ఇయర్‌గా నిలిచింది. ఇక ఈ బాలీవుడ్ బాద్‌షా సినిమాలకు, తన కెరీర్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే షారుఖ్‌ను తన ఫ్యాన్స్ అంతా ఫ్యామిలీ మ్యాన్ అంటుంటారు. తాజాగా అదే మరోసారి నిరూపించారు ఈ సీనియర్ హీరో. తాజాగా ‘జవాన్’ చిత్రానికి ఉత్తమ హీరోగా అవార్డ్ అందుకున్న తర్వాత ఫ్యామిలీని ఉద్దేశించి షారుఖ్ ఇచ్చిన స్పీచ్.. అందరినీ ఆకట్టుకుంది.
మీ నాన్న బ్రతికి ఉన్నంత వరకు..
తాజాగా 2024 జీ సినీ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. అందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఎన్నో కేటగిరిల్లో మిగతా సినిమాలను వెనక్కి నెట్టి.. ఈ సినిమా అవార్డులను దక్కించుకుంది. ఇక షారుఖ్‌కు కూడా ‘జవాన్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. అవార్డ్ అందుకున్న తర్వాత స్టేజ్‌పైనే తన ఫ్యామిలీకి ఒక మాటిచ్చారు షారుఖ్. ‘‘ఈ మెసేజ్ నా పిల్లలకు, నా భార్యకు చెప్పాలనుకుంటున్నాను. మీ నాన్న బ్రతికి ఉన్నంత వరకు ఎంటర్‌టైన్మెంట్ కూడా బ్రతికే ఉంటుంది’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు షారుఖ్ ఖాన్. దీంతో ఫ్యాన్స్ అంతా మరోసారి ఈ హీరో కాన్ఫిడెన్స్ చూసి ఫిదా అవుతున్నారు.
సినిమాలు చేయడం ఆపేశాను..
ఇక కొన్నేళ్ల క్రితం తన ఎదుర్కున్న బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌పై కూడా షారుఖ్ స్పందించారు. ‘‘నాలుగైదు ఏళ్ల క్రితం నా సినిమాలు వర్కవుట్ అవ్వని సమయంలో నేను చాలా కృంగిపోయాను. సినిమాలు చేయడం ఆపేశాను. ఇంట్లో కూర్చున్నాను. పిజ్జాలు, రోటీలు చేశాను. నా పిల్లలతో సమయాన్ని గడిపాను. అప్పుడే కోవిడ్ 19 వచ్చింది’’ అంటూ ఫ్లాప్స్‌ను తను ఎలా ఎదుర్కున్నారో చెప్పుకొచ్చారు షారుఖ్. ఇక అదే సమయంలో తన దగ్గరకు ‘జవాన్’ కథతో అట్లీ వచ్చాడని గుర్తుచేసుకున్నారు. ‘‘ముందుగా క్రెడిట్ అట్లీకి వెళ్తుంది. ఆ తర్వాత ప్రియాకు. ప్రియా.. సౌత్‌లో తన ఇల్లును వదిలేసి ముంబాయ్‌లో నాలుగేళ్లు గడపడానికి వచ్చేసింది. తను ఇక్కడే బిడ్డకు కూడా జన్మనిచ్చింది’’ అంటూ అట్లీని మాత్రమే కాదు.. తన భార్య ప్రియాను కూడా ప్రశంసల్లో ముంచేశారు షారుఖ్.
King Khan makes a promise 🤝💯❤️@iamsrk @ZeeCineAwards #ShahRukhKhan𓀠 #ZeeCineAwards2024 #SRK #KingKhan pic.twitter.com/oVyzc5gpDw
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) March 12, 2024
తనకు కూడా క్రెడిట్..
‘‘జవాన్ సినిమా సక్సెస్ క్రెడిట్ అట్లీ, ప్రియాకు మాత్రమే కాదు.. వారి కొడుకు మీర్‌కు కూడా వెళ్తుంది. థాంక్యూ అట్లీ’’ అంటూ ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న తర్వాత ‘జవాన్’ చిత్ర దర్శకుడికి పూర్తి క్రెడిట్‌ను ఇచ్చేశారు షారుఖ్ ఖాన్. ఇక 2023 అనేది షారుఖ్ ఖాన్ కెరీర్‌లో మర్చిపోలేని సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ముందుగా ‘పఠాన్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి.. చాలాకాలంగా నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌ను హ్యాపీ చేశారు షారుఖ్. ఆ తర్వాత వెంటనే ‘జవాన్’ అంటూ వచ్చారు. సౌత్ దర్శకుడితో మొదటిసారిగా చేతులు కలిపి షారుఖ్ చేసిన ‘జవాన్’ ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రాజ్‌కుమార్ హిరానీతో కలిసి ‘డంకీ’ కూడా చేశారు. ఇది షారుఖ్‌కు కొత్త జోనర్ అయినా అందులో తన నటన అందరినీ ఆకట్టుకుంది.
Also Read: హీరోయిన్‌తో నిశ్చితార్థం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం - ఫోటోలు వైరల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)