అన్వేషించండి

నన్ను రేప్ చేసిన దుర్మార్గుడు వీడే అని సౌందర్య చిరంజీవికి చెప్పింది: నటుడు సత్య ప్రకాష్ కామెంట్స్

టాలీవుడ్ లో నెగిటివ్ రూల్స్ తో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్య ప్రకాష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌందర్యతో రేప్ సీన్ గురించి అలాగే తన సినీ కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో నెగిటివ్ రోల్స్ చేసి విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్య ప్రకాష్. తెలుగులో దాదాపు 20కి పైగా సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. ఒక తెలుగులోనే కాకుండా సుమారు 11 భాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించి నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో ఎక్కువగా విలన్ రోల్స్ లోనే కనిపించేవాడు. ప్రస్తుతం అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య ప్రకాష్ తన సినీ కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సత్య ప్రకాష్‌ను ‘‘అప్పటి సినిమాల్లో ఎక్కువగా రేప్ సీన్లలో నటించేవారు కదా. ఆ సన్నివేశాలు చేసేటప్పుడు మీరు ఏమైనా ఇబ్బంది పడేవారా?’’ అని అడిగితే, సత్య ప్రకాష్ బదులిస్తూ.."మొదట్లో చాలా ఇబ్బంది పడేవాడిని. నిజం చెప్పాలంటే నేను అలాంటి సినిమాల్లో అసలు నటించను. నాకు ఇష్టం లేదు. కాకపోతే ఈ పాత్ర నేను చెయ్యను, చేయలేను అని చెప్పే స్తోమత నాకు అప్పుడు లేదు. తెలుగులో చాలా సినిమాల్లో రేప్ సన్నివేశాల్లో నటించాను" అని అన్నారు.

"నేను భోజ్ పూరి సినిమా చేస్తున్న సమయంలో రేప్ సీన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ‘‘సిటీలో కొత్తగా రేపిస్ట్ వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి’’  అని పెద్ద హెడ్ లైన్స్ తో రాశారు. కానీ కంటెంట్ లోకి వెళ్తే ఇలా పలానా సినిమాలో ఈయన రేప్ సీన్ లో నటించారు అని రాశారు. ఆ తర్వాత నేను అతనితో మాట్లాడి ఇలాంటివి రాస్తే యూపీ, మహారాష్ట్రలో నన్ను చంపేస్తారని చెప్పాను. ఆ తర్వాత అతను కన్విన్స్ అయ్యాడు" అని చెప్పుకొచ్చాడు.

‘‘సౌందర్య గారితో ఓ రేప్ సీన్ చేస్తున్న టైంలో ఆమె డైరెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారట కదా? అని యాంకర్ అడిగితే.. "చూడాలని ఉంది మూవీ టైంలో అనుకుంటా. ఆ సినిమాలో ఆవిడే హీరోయిన్. నేను అన్నపూర్ణ స్టూడియోలోని ఓ సెట్ లో షూటింగ్ చేస్తుంటే పక్కనే చిరంజీవి గారు ఉన్నారని తెలిస్తే కలవడానికి వెళ్లాను. అప్పుడు చిరంజీవి గారి పక్కన సౌందర్య కూర్చున్నారు. అప్పుడు సౌందర్య, చిరంజీవి గారు నా కెరియర్ లో ఒకే ఒక్క సినిమాలో రేప్ జరిగింది. ఆ రేప్ చేసిన దుర్మార్గుడు వీడే అని చిరంజీవి గారితో చెప్పింది. అప్పుడు నేను దాన్ని కాంప్లిమెంట్ గా తీసుకున్నాను" అని తెలిపారు.

‘బిగ్ బాస్’ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి గారు తనకు ఓ సలహా ఇచ్చారని అప్పటి సంఘటనని గుర్తు చేస్తూ.. "బిగ్ బాస్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు అన్నయ్యకు మధ్య ఓ సీన్ షూటింగ్ జరిగింది. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను బైక్ వేసుకొని వెళ్లిపోయాను. ఆ మరుసటి రోజు అన్నయ్య నన్ను పిలిచి, నువ్వు రోజు షూటింగ్ ఎలా వస్తావు? అని అడిగితే బైక్ మీద వస్తాను అని చెప్పాను. హెల్మెట్ పెట్టుకుంటావా? అని అడిగితే లేదు అని చెప్పాను. దానికి అన్నయ్య, 'అది చాలా తప్పు. నువ్వు ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవుతావ్. నువ్వు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళుతూ ఉంటే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే నీలాంటి ఒక మంచి స్టార్ ని మిస్ అవుతుంది అని ఆరోజు చెప్పారు. ఆయన బ్లెస్సింగ్ వల్లే ఈరోజు నేను ఈ స్టేజిలో ఉన్నాను" అంటూ సత్య ప్రకాష్ చెప్పుకొచ్చారు.

Also Read : ‘బిగ్ బాస్’ బ్యూటీ శోభా శెట్టి - వారానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram Collections Day 9: సమంత దూకుడుకు సాటేది... తొమ్మిదో రోజూ బంగారం కలెక్షన్స్ సూపరే
సమంత దూకుడుకు సాటేది... తొమ్మిదో రోజూ బంగారం కలెక్షన్స్ సూపరే
Veerabhadruni Rahasyam Series Trailer : వీరభద్రపురంలో గంట మోగిందా? - థ్రిల్లర్ సిరీస్ వీరభద్రుని రహస్యం ట్రైలర్ రివ్యూ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
వీరభద్రపురంలో గంట మోగిందా? - థ్రిల్లర్ సిరీస్ వీరభద్రుని రహస్యం ట్రైలర్ రివ్యూ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Venkatesh Maha : నేను మాట్లాడింది అల్ట్రా వయలెన్స్ మూవీస్ గురించి - KGF కాంట్రవర్సీపై డైరెక్టర్ వెంకటేశ్ క్లారిటీ
నేను మాట్లాడింది అల్ట్రా వయలెన్స్ మూవీస్ గురించి - KGF కాంట్రవర్సీపై డైరెక్టర్ వెంకటేశ్ క్లారిటీ
Rao Bahadur Review : ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు - రావు బహదూర్‌పై సుకుమార్ రివ్యూ
ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు - రావు బహదూర్‌పై సుకుమార్ రివ్యూ

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Hair Mask To Boost Hair Growth : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Embed widget