By: ABP Desam | Updated at : 03 Oct 2023 06:25 PM (IST)
Photo Credit : Appaji Ambarisha/Instagram
టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వయసులోనూ యువ హీరోలకు ధీటుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అంతేకాదు ఓ పాత్ర కోసం ఆయన ఎక్కడి వరకైనా వెళ్తారు చివరికి ప్రాణం పెట్టేస్తారు. అది ఎలాంటి పాత్ర అయినా కావచ్చు. అందులో పరకాయ ప్రవేశం చేసే అద్భుతంగా నటిస్తారు. ప్రస్తుతం 'అఖండ', 'వీర సింహారెడ్డి' బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య త్వరలోనే 'భగవంత్ కేసరి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే తాజాగా బాలయ్య గొప్పతనం గురించి, ఆయన సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధం అవుతారనే విషయాన్ని ప్రముఖ నటుడు అప్పాజీ అంబరీష ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు." బాలకృష్ణ గారు నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో నేను కూడా నటించాను. ఎన్టీఆర్ కథానాయకుడు క్లైమాక్స్ లో నా పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఎన్టీఆర్ మహానాయకుడులో ఫుల్ లెన్త్ రోల్ చేశాను. సినిమాలో జీవన్ రెడ్డి పాత్ర చేశాను. ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో నన్నపని రాజకుమారి వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ ముందు గాజులు పగలగొట్టే సీన్ ని షూట్ చేస్తున్నాం. ఆ సీన్ లో బాలయ్య గారి ముందు గాజులు పగలగొట్టి, ఉమ్మివేయడానికి భయపడుతున్నారు. అప్పుడు బాలయ్య గారు వాళ్లతో మనం జరిగింది చేస్తున్నాం. మీరేం భయపడకుండా నిజంగానే గాజులు పగలగొట్టి నా మీద ఉమ్మి వేయండి. ఉమ్మివేసినట్టు నటించకండి, నిజంగానే ఉమ్మేయండి అని చెప్పడంతో నేను షాక్ అయిపోయాను" అని అన్నారు.
"ఆ తర్వాత బాలయ్య గారిని నేను ఏంట్రా దమ్ముంటే రా రా చూసుకుందాం’’ అని డైరెక్ట్ గా చెప్పాలి. ఆ సీన్ అయిపోయాక మీరు బాగా చేస్తున్నారు అని నన్ను అభినందించారు. సీన్ అయిపోయిన తర్వాత ప్యాకప్ చెప్పేశా మా అందరు వెళ్ళిపోయారు. ఇదంతా ఒరిజినల్ అసెంబ్లీలోనే జరిగింది. ప్యాకప్ చెప్పిన తర్వాత క్రిష్‌తో చెప్పి బాలయ్య గారు వెళ్లిపోయారు. మేమక్కడే ఉన్నాం. అప్పుడు బాలకృష్ణ గారు మళ్ళీ వెనక్కి నా దగ్గరకు వచ్చి వెళ్లేటప్పుడు మీకు చెప్పలేదు మీకు చెప్పి వెళదామని అన్నారు. అది చూసి నేను షాక్ అయిపోయా. ఆయన అలా అంటారని నేనే కాదు ఎవరు ఊహించరు" అని పేర్కొన్నారు.
ఆయన వెళ్లేటప్పుడు నాకు చెప్పలేదని, మళ్లీ చెప్పడానికి వెనక్కి వచ్చి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్లడం అది ఆయన మంచితనం, సంస్కారం. ఆ మరుసటి రోజు నుంచి షూటింగ్ పూర్తయ్యే దాకా ఆయన పక్కన ఓ కుర్చీ వేయించి రండి నా పక్కన కూర్చుండి అని కూర్చోబెట్టుకొని సరదాగా కబుర్లు చెప్పేవారు. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు రామారావు గారి గురించి, ఆయన అనుభవాల గురించి, క్రికెట్ మీద అనుభవాల గురించి ఇలా అన్నీ నాతో పంచుకునేవారు" అంటూ చెప్పుకొచ్చారు అప్పాజీ. దీంతో బాలయ్య పై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : నా లైఫ్ నా ఇష్టం, వాటిని అస్సలు పట్టించుకోను - హృతిక్ రోషన్‌తో డేటింగ్‌పై సబా ఆజాద్ కామెంట్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Jamal Kudu Song: బాబీడియోల్ ‘జమల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?
Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
/body>