Sasivadane Release Date: గోదారి నేపథ్యంలో అందమైన ప్రేమకథ... రక్షిత్, కోమలి సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Rakshit Atluri's Sasivadane Release: 'పలాస 1978' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన కొత్త సినిమా 'శశివదనే'. గోదారి నేపథ్యంలో అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరులో విడుదల కానుంది.

Sasivadane Movie Release Date Announced: 'పలాస 1978'తో భారీ విజయం అందుకున్న యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'శశివదనే'. ఇందులో కోమలి ప్రసాద్ హీరోయిన్. నాని సూపర్ హిట్ సినిమా 'హిట్ 3'లో ఆవిడ ఓ క్యారెక్టర్ చేశారు. అయితే ఇందులో ఆ అమ్మాయి హీరోయిన్. గోదావరి నేపథ్యంలో అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదీ ఎప్పుడో తెలుసా?
అక్టోబర్ 10న 'శశివదనే' విడుదల
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటించిన 'శశివదనే' సినిమాను ప్రముఖ స్టయిలిస్ట్ గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ సంస్థల మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అక్టోబర్ 10న థియేటర్లలోకి 'శశివదనే'ను తీసుకు వస్తామని నిర్మాతలు తెలిపారు. దసరా బరిలో విడుదలకు రెడీ అయిన సినిమాల్లో ఇప్పుడు ఈ మూవీ కూడా చేరింది.
Also Read: నాలుగు రోజుల్లో 400 కోట్లు... వీకెండ్ తర్వాత నిలబడిందా? ఇండియాలో రజనీ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయ్?
ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా 'శశివదనే'ను తెరకెక్కించమని, విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇంకా నిర్మాతలు మాట్లాడుతూ... ''సాయి కుమార్ దారా అందించిన సినిమాటోగ్రఫీ, శరవణ వాసుదేవన్ ఇచ్చిన స్వరాలు మా 'శశివదనే'కు ప్రధాన ఆకర్షణ. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అని కూడా చెప్పవచ్చు. వెండితెరపై మన ప్రేక్షకులకు ఒక దృశ్యకావ్యంగా ఉంటుంది. అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం బలం అవుతుంది'' అని చెప్పారు.
Also Read: ఊహించని విధంగా పడిపోయిన వసూళ్లు... NTR, Hrithik సినిమాకు బాక్సాఫీస్ బరిలో షాక్
Our FILM is READY ❤️
— Ahiteja Bellamkonda (@ahiteja) August 18, 2025
Our distributors want us to give the best date and we locked it on OCT 10th 🙏🏻
“PRANAM PETTESAM” Please take 2 hours of your precisious time and watch #Sasivadane in theatre’s 🤗
I PROMISE “YOU WON’t REGRET”
Keep supporting & Thank you ❤️@RakshitAtluri… pic.twitter.com/14v74Bjg5C
Sasivadane Movie Cast And Crew: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన 'శశివదనే' సినిమాలో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయి కుమార్ దారా, కూర్పు: గ్యారీ బీహెచ్, స్వరాలు: శరవణ వాసుదేవన్, నేపథ్య సంగీతం: అనుదీప్ దేవ్, నిర్మాణ సంస్థలు: ఏజీ ఫిల్మ్ కంపెనీ - ఎస్‌వీఎస్ స్టూడియోస్, కాస్ట్యూమ్స్ - సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ - అభిలాష్ రెడ్డి గోదాల, దర్శకుడు: సాయి మోహన్ ఉబ్బన.




















