అన్వేషించండి

తండ్రి సైఫ్‌ను అరెస్ట్ చేసిన కూతురు సారా అలీ ఖాన్ - ఇదేం మాస్ యాడ్ మామా!

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తాజాగా తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ తో కలిసి మొదటిసారి ఓ యాడ్ లో నటించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే విక్కీ కౌశల్ సరసన ' జర హాట్కే జర బచ్కే' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే సారా అలీ ఖాన్ తాజాగా తన తండ్రితో కలిసి మొట్టమొదటిసారి నటించింది. సైఫ్ అలీ ఖాన్, సారా అలీ ఖాన్ ఈ తండ్రి కూతుర్లు కలిసి తాజాగా ఓ యాడ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోని సారా అలీ ఖాన్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ తండ్రీ, కూతుర్లు కలిసి నటిస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. అలాంటి అభిమానుల కోరికను తీరుస్తూ ఓ చిన్న యాడ్‌లో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ యాడ్ వీడియోలో సారా అలీ ఖాన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ఖైదీగా నటించారు.

అయితే మొదటిసారి ఈ తండ్రీ కూతుర్లను ఈ యాడ్ లో చూసిన అభిమానులు వీళ్ళిద్దరూ కలిసి త్వరలోనే ఓ సినిమాలో నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. ఇక ఈ యాడ్ విషయానికొస్తే.. ఇదొక కార్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన యాడ్. సైఫ్ అండ్ సారా అకో ఇండియా కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన పలు యాడ్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కంపెనీకి సంబంధించిన రెండు యాడ్స్ ని సారా అలీ ఖాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ ఆడ్లో ఈ తండ్రీ కూతుర్లు స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకోగా.. మరో యాడ్‌లో సారా అలీ ఖాన్ పోలీస్ ఆఫీసర్‌గా, సైఫ్ అలీ ఖాన్ ఖైదీగా కనిపించి ఆకట్టుకున్నారు. మొదటి సారి తండ్రి, కూతుర్లు కలిసి యాడ్ చేయడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ యాడ్ కు సంబంధించిన వీడియోని షేర్ చేసిన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర పోస్టులు పెట్టింది. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ లో సారా అలీ ఖాన్ పోస్ట్ చేస్తూ.. "నేను మా నాన్నకు కార్ ఇన్సూరెన్స్ గురించి ఓ కొత్త ట్రిక్ నేర్పించాను" అని రాసుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై పలువురు నెటిజెన్స్ స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. క్రమంలోనే ఓ నెటిజన్.. ఈ యాడ్ కి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియో కావాలని కోరగా.. మరొక నెటిజన్ హ్యాండ్సమ్ పాపా, క్యూట్ డాటర్ అని, ఇంకొకరు.. సైఫ్, సారా త్వరగా సినిమా చేస్తే చూడాలని ఉందని, మీ ఇద్దరినీ సినిమాలో చూడాలనుకుంటున్నాను" అంటూ కామెంట్స్ చేసారు.

కాగా సారా అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ అమృత సింగ్ ల మొదటి సంతానం. సారా కి తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. సారా అలీ ఖాన్ తమ్ముడు ఇబ్రహీం అలీ కూడా త్వరలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక అమృత సింగ్ తో విడిపోయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత 2012 ఆమెను పెళ్లి చేసుకోగా 2016లో వీరికి కొడుకు పుట్ట్టాడు. అతనికి తైమూర్ అలీ ఖాన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత 2021 రెండో కొడుకు జన్మించగా అతనికి జహంగీర్ అలీ ఖాన్ అని నామకరణం చేశారు. సారా అలీ ఖాన్ వీళ్ళందరితో మంచి బాండింగ్ ని ఏర్పరచుకుంది.

Also Read : ‘ఓ మై గాడ్’, ఏకంగా శివుడి పాత్రనే మార్చేయాలట - అక్షయ్ కుమార్ మూవీకి సెన్సార్ షాక్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

View this post on Instagram
 
A post shared by Sara Ali Khan (@saraalikhan95)

View this post on Instagram
 
A post shared by Sara Ali Khan (@saraalikhan95)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget