అన్వేషించండి

Sapthami Gowda: పెళ్లయిన హీరోతో ‘కాంతార’ నటి ఎఫైర్? హోటల్ రూమ్‌లో కలిసున్నారంటూ భార్య ఆరోపణలు, కోర్టు మెట్లు ఎక్కిన సప్తమి గౌడ

Sapthami Gowda: ‘కాంతార’ హీరోయిన్ సప్తమి గౌడ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తాజాగా ఈ భామ.. ఒక హీరోతో వివాహేతర సంబంధంలో ఉందంటూ ఆ హీరో భార్య చేసిన ఆరోపణలు వైరల్‌గా మారుతున్నాయి.

Sapthami Gowda - Yuva Rajkumar: ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో ఒక స్టార్ కిడ్ విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ మనవడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు అయిన యువ రాజ్‌కుమార్‌.. తన భార్య శ్రీదేవి బైరప్పతో కలిసి ఉండలేను అంటూ జూన్ 6న విడాకులు దాఖలు చేశారు. విడాకులు ఇవ్వడం ఇష్టం లేని శ్రీదేవి.. తన భర్త యువ రాజ్‌కుమార్‌పై సంచలన ఆరోపణలు చేసింది. మరో అమ్మాయితో తనకు ఎఫైర్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తను మరెవరో కాదు.. ‘కాంతార’ హీరోయిన్ సప్తమి గౌడ. యువ రాజ్‌కుమార్, సప్తమి గౌడకు మధ్య వివాహేతర సంబంధం ఉందని అతడి భార్య శ్రీదేవి చేసిన ఆరోపణలు శాండిల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

పరువునష్టం..

యువ రాజ్‌కుమార్, శ్రీదేవికి అయిదేళ్ల క్రితం అంటే 2019లో పెళ్లి జరిగింది. ఇన్నాళ్లు వారు వివాహ బంధంలో కలిసున్న తర్వాత శ్రీదేవి తనను మానసికంగా హింసిస్తుందని, వదిలేసి వెళ్లిపోయిందని కారణాలు చెప్తూ తన నుండి విడాకులు కోరాడు యువ రాజ్‌కుమార్. భర్తకు విడాకులు ఇవ్వడానికి శ్రీదేవి నిరాకరిస్తూనే అతడిపై సంచలన ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే యువ రాజ్ కుమార్ కు ఓ నటి ఎఫైర్ ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఆమె 'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడతో అని, ఆమెతోనే తన భర్త ఎఫైర్ ఉందని ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఇక తమ విడాకులు వ్యవహరంలో  తన పేరు తెరపైకి రావడంతో సప్తమి కూడా చట్టపరమైన చర్యలు దిగింది. శ్రీదేవిపై పరువునష్టం దావా వేసింది. తన మర్యాదకు భంగం కలిగించిందని చెప్తూ రూ.10 కోట్లు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై కోర్టు.. శ్రీదేవికి నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తోంది.

Sapthami Gowda: పెళ్లయిన హీరోతో ‘కాంతార’ నటి ఎఫైర్? హోటల్ రూమ్‌లో కలిసున్నారంటూ భార్య ఆరోపణలు, కోర్టు మెట్లు ఎక్కిన సప్తమి గౌడ

దొరికిపోయారు..

రాజ్‌కుమార్ వారసుడిగా ఇటీవల సినిమాల్లో హీరోగా ఎంటర్ అయ్యాడు యువ రాజ్‌కుమార్. ‘యువ’ అనే టైటిల్‌తో తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో యువ సరసన హీరోయిన్‌గా సప్తమి గౌడ నటించింది. అయితే ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి.. అంటే దాదాపు ఒక సంవత్సరం నుండి వీరిద్దరూ వివాహేతర సంబంధంలో ఉన్నారని శ్రీదేవి ఆరోపణలు చేసింది. కొన్నాళ్ల తర్వాత తన పీజీని పూర్తి చేయడానికి శ్రీదేవి హార్డ్వర్డ్ వెళ్లిపోయింది. అప్పటినుండి యువ, సప్తమి కలిసి తిరుగుతున్నారని, తాను అమెరికా నుండి తిరిగొచ్చి చూసేసరికి వాళ్లిద్దరూ హోటల్ రూమ్‌లో క్లోజ్‌గా ఉంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చెప్పింది.

బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు..

యువ రాజ్‌కుమార్ తన భార్య శ్రీదేవి నుండి విడాకులు కోరిన విషయం చాలామందికి తెలియదు. కానీ శ్రీదేవి వచ్చి యువ, సప్తమికి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు చేయగానే ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ విషయంపై ఇరు వర్గాల తరపున లాయర్లు తామ వాదనలు వినిపించారు. యువ రాజ్ కుమార్ వివాహేతర సంబంధం గురించి శ్రీదేవి ఆరోపణలు చేయడంతో అతడి తరపున లాయర్ కూడా శ్రీదేవికి చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని, తనెప్పుడూ ఒక భార్యగా తన బాధ్యతలు నిర్వర్తించలేదని ఆరోపించారు. 2019లో శ్రీదేవి, యువ రాజ్‌కుమార్ పెళ్లి చేసుకోగా.. దానికంటే చాలాకాలం ముందు నుండే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు.

Also Read: విఘ్నేశ్‌తో గొడవ జరిగింది - ఓ రోజు ఫోన్‌ చేసి గట్టిగా అరిచాను, నయనతార వల్లే.. విజయ్‌ సేతుపతి షాకింగ్ కామెంట్స్‌

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Shakeela Warning : షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
Sukriti Veni : ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget