![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sanjay Dutt On Injury : దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్
కన్నడ సినిమా 'కేడీ' షూటింగులో సంజయ్ దత్ (Sanjay Dutt Injured)కు గాయాలు అయినట్లు బుధవారం వార్తలొచ్చాయి. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. ఏం చెప్పారంటే?
![Sanjay Dutt On Injury : దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్ Sanjay Dutt Dismisses reports of getting injured on the sets of Dhruva Sarja's KD Movie Sanjay Dutt On Injury : దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/0ab18690b50ccd8373590e9a38707b611681358606223313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
''ఆ దేవుడి దయ వల్ల నేను బావున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను'' అని బాలీవుడ్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. దీని వెనుక ఓ కారణం ఉంది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నారు. కన్నడ సినిమా 'కేడీ' షూటింగ్ చేస్తున్నారు. అందులో ఆయన గాయపడినట్లు కన్నడ చిత్రసీమ నుంచి వార్తలు వచ్చాయి. వాటిని సంజయ్ దత్ ఖండించారు.
బాంబు సీక్వెన్స్ తీస్తుండగా...
ఫైట్ మాస్టర్ రవి వర్మ నేతృత్వంలో 'కేడీ' సినిమా కోసం ఓ భారీ బాంబు పేలుడు సన్నివేశం తీస్తున్నారు. అప్పుడు సంజయ్ దత్ గాయపడినట్లు బుధవారం కన్నడ ఇండస్ట్రీ నుంచి లీకులు వచ్చాయి. సంజయ్ దత్ ముఖానికి, చేతికి, భుజానికి గాయాలు అయ్యాయని, దాంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేసి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకు వెళ్లారని పేర్కొన్నారు. సంజయ్ దత్ అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కన్నడ చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే... సదరు వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని సంజయ్ దత్ ట్వీట్ చేశారు.
నా కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు! - సంజయ్ దత్
''నేను గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే... అవి పూర్తిగా నిరాధారమైనవి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. 'కేడీ' సినిమా షూటింగ్ చేస్తున్నాను. నా సన్నివేశాలు తీసేటప్పుడు చిత్ర బృందం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది'' అని సంజయ్ దత్ పేర్కొన్నారు.
Also Read : ఎన్టీఆర్ ఇంట్లో అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ - అసలేం జరిగిందంటే?
There are reports of me getting injured. I want to reassure everyone that they are completely baseless. By God’s grace, I am fine & healthy. I am shooting for the film KD & the team's been extra careful while filming my scenes. Thank you everyone for reaching out & your concern.
— Sanjay Dutt (@duttsanjay) April 12, 2023
'కెజియఫ్' సినిమాతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt)కు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొత్త ఇమేజ్ వచ్చింది. కన్నడ పరిశ్రమ మరో కొత్త విలన్ దొరికాడని సంబరపడింది. కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన సమయంలోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఖల్ నాయక్ నటించారు. అయితే, 'కెజియఫ్'లో అధీరా పాత్ర స్టైల్ సపరేట్.
'కెజియఫ్'లో అధీరా పాత్ర విలనిజాన్ని, క్రూరత్వాన్ని కొత్త కోణంలో చూపించింది. ఆ పాత్ర తర్వాత కన్నడ నుంచి సంజూ బాబాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే, ఆయన ఆచితూచి క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా (Dhruva Sarja) కథానాయకుడిగా రూపొందుతోన్న 'కేడీ'లో ఆయన నటిస్తున్నారు.
రక్షిత భర్త దర్శకత్వంలో...
'కేడీ' సినిమాకు ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఎవరో కాదు... తెలుగులో పలు సినిమాల్లో కథానాయికగా నటించిన 'ఇడియట్' ఫేమ్ రక్షిత భర్త. సినిమా అనౌన్స్ చేసినప్పుడు టీజర్ కూడా విడుదల చేశారు.
Also Read : హాయ్ రామా ఏ క్యా హువా - ఆరెంజ్ కలర్ డ్రస్‌లో పూజ
'రామాయణ యుద్ధం స్త్రీ కోసం.. మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం' అనే మాటతో 'కేడీ' టీజర్ మొదలైంది. ఆ తర్వాత కాళీ అనే వ్యక్తి రిలీజ్ అవుతున్నాడని... పోలీసులు సిటీ మొత్తాన్ని అలెర్ట్ చేయడం, సిటీ లోపలికి అతడు రాకుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకోవడం చూపించారు. అతడిని చంపడానికి వేల మంది జనాలు రెడీగా ఉన్నారని పోలీసులు అనుకుంటారు. అయితే, ఆ వ్యక్తిని ఊరేగించడానికి వేల మంది జనాలు జైలు దగ్గరకు తరలివస్తారు. మెల్లగా నిప్పుల మధ్య హీరోను రివీల్ చేస్తూ... 'ఫీల్డ్ లోకి దిగాక యుద్ధంచేయాల్సిందే! చస్తే వీరమరణం... గెలిస్తే సింహాసనం... యుద్ధం మొదలెడదామా అన్నయ్యా' అంటూ హీరోతో డైలాగ్ చెప్పించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)