Niharika Konidela: 'మ్యాడ్ స్క్వేర్' హీరోతో నిహారిక కొణిదెల నెక్స్ట్ మూవీ - హీరోయిన్ ఎవరంటే?
Nayan Sarika: నిర్మాతగా నిహారిక కొణిదెల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. మానస శర్మ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు.

Nayan Sarika In Niharika Konidela New Movie: 'కమిటీ కుర్రోళ్లు'తో గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నారు నిహారిక కొణిదెల. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె నిర్మించిన ఫస్ట్ మూవీ గతేడాది రిలీజై సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. మంచి కలెక్షన్స్ రాబట్టింది.
యూత్ సహా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన 'కమిటీ కుర్రాళ్లు' ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డులను సైతం గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు బెస్ట్ ఫస్ట్ మూవీ డైరెక్టర్‌గా యదు వంశీ అవార్డు అందుకున్నారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి కథాంశంగా ఎమోషన్స్, సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.
సంగీత్ శోభన్ సోలో హీరోగా...
నిర్మాతగా నిహారిక కొణిదెల ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకోగా... తన బ్యానర్‌లో నెక్స్ట్ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా... నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆయ్, క వంటి చిత్రాల్లో ఆమె తన నటనతో మెప్పించారు. అలాగే... 'హలో వరల్డ్', 'బెంచ్ లైఫ్' వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. సంగీత్ సోలో హీరోగా నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇదే.
ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమె ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యారు. సంగీత్ శోభన్, నయన్ సారికతో పాటు మూవీలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The beautiful @UrsNayan joins the joyride that is #ProductionNo2!
— Pink Elephant Pictures (@PinkElephant_P) June 26, 2025
Excited for all the fun ahead with this amazing team ❤️😎#PEP2@IamNiharikak #SangeethShobhan #ManasaSharma @anudeepdev #MaheshUppala @manyam73 @beyondmediapres @Ticket_Factory pic.twitter.com/G7LwesEqHG
ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఎంట్రీ
జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
బ్యానర్ - పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, కథ - మానస శర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - మహేష్ ఉప్పాల, మానస శర్మ, మ్యూజిక్ - అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, ప్రొడ్యూసర్ - నిహారిక కొణిదెల, దర్శకత్వం - మానస శర్మ, పి.ఆర్.ఒ - సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), మార్కెటింగ్ - టికెట్ ఫ్యాక్టరీ.






















