Samyuktha : సంయుక్త లేడీ ఓరియంటెడ్ మూవీ స్టార్ట్... రానా చేతుల మీదుగా లాంఛ్
Female Centric Action Thriller : సౌత్ స్టార్ హీరోయిన్ సంయుక్త లీడ్ రోల్ చేయనున్న లేడి సెంట్రిక్ మూవీ లాంచ్ కార్యక్రమం ఈరోజూ గ్రాండ్ గా జరిగింది. మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం.
Samyuktha New Movie : ప్రస్తుతం వరుస సినిమాలతో సౌత్ లో బిజీగా ఉన్న హీరోయిన్లలో సంయుక్త కూడా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ మరో పెద్ద ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. హాస్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించే అద్భుతమైన అవకాశాన్ని అందుకుంది సంయుక్త. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కాగా, సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.
రానా చేతుల మీదుగా మూవీ లాంచ్
పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో భాగమై టాలీవుడ్ లక్కీ ఛార్మ్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మొట్టమొదటిసారిగా ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నటిస్తోంది. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. యోగేష్ కేఎంసి ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రామానాయుడు స్టూడియోలో సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ హీరో రానా, స్టార్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోన వెంకట్, డైరెక్టర్ వెంకీ కుడుముల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానా క్లాప్ కొట్టగా, డైరెక్టర్ వెంకీ కుడుముల, కోన వెంకట్ స్క్రిప్టును అందజేశారు. సంయుక్త ఫస్ట్ తెలుగు మూవీ హీరో రానా ఈ సినిమాకు క్లాప్ కొట్టడం విశేషం. కమర్షియల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
On this blessed occasion of Navratri 🙏
— Rajesh Danda (@RajeshDanda_) October 9, 2024
We're excited to announce our @HasyaMovies Production No. 6, featuring the vibrant @iamsamyuktha_, launched today with a sacred pooja ceremony ❤️🔥
Get ready for a groundbreaking female-centric action thriller! 💥
Directed by #YogeshKMC… pic.twitter.com/WObCHRVIv4
వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంయుక్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన ' భీమ్లా నాయక్' సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఆమె రానా వైఫ్ గా నటించింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన విరూపాక్ష, 'బింబిసార, సర్' సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ ని లక్కీ ఛార్మ్ గా భావించడం మొదలుపెట్టారు. అయితే 'సార్' మూవీ హిట్ తర్వాత కొంతకాలం పలు పర్సనల్ కారణాల వల్ల సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంయుక్త 'లవ్ మీ, డెవిల్' అనే సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఆమె ఖాతాలో 'స్వయంభు' అనే పాన్ ఇండియా మూవీ ఉంది. ఇందులో నిఖిల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే 'రామ్' అనే మలయాళ మూవీ చేస్తోంది. శర్వానంద్ 37వ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన సంయుక్త, బెల్లంకొండ శ్రీనివాస్ 12వ సినిమాలో కూడా భాగం కాబోతోంది. మరోవైపు 'మహారాగ్ని' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడేమో లేడీ ఓరియంటెడ్ సినిమాతో కొత్త ప్రయోగం చేయబోతోంది సంయుక్త. ఆమె నెక్స్ట్ మూవీ రిలీజ్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also: అమితాబ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే రజనీది లాస్ట్ బెంచ్ - వేట్టయన్ దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్