అన్వేషించండి

Vettaiyan: అమితాబ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే రజనీది లాస్ట్ బెంచ్ ‌- వేట్టయన్ దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్

అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ పై ‘వేట్టయాన్’ దర్శకుడు జ్ఞానవేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సెట్స్ లో బిగ్ బీ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లా ఉంటే, రజనీకాంత్ బ్యాక్ బెంజ్ స్టూడెంట్ లా ఉండేవారన్నారు.

TJ Gnanavel About Amitab And Rajinikanth: రజనీకాంత్ హీరోగా, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వేట్టయన్’ ఈ నెల 10 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే పలు ఛానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నది. తాజాగా తెలుగులో ‘వేట్టయన్’ టీమ్ యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జ్ఞానవేల్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు రజనీకాంత్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. అమితాబ్ షూటింగ్ కోసం బాగా ప్రిపేరై వస్తే, రజనీకాంత్ స్పాంటేనియస్ గా యాక్టింగ్ చేస్తారని చెప్పుకొచ్చారు.  

బిగ్ బీ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్.. రజనీ లాస్ట్ బెంచ్ స్టూడెంట్..

సినిమా సెట్స్ లో బిగ్ బీ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లా ఉంటే, రజనీకాంత్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లా వ్యవహరించే వారని దర్శకుడు జ్ఞానవేల్ వెల్లడించారు. "బచ్చన్ సర్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, రజనీకాంత్ సార్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్. బచ్చన్ సర్ మొదటి రోజే మనల్ని టెన్షన్‌ గా ఫీలయ్యేలా చేస్తాడు. నన్ను పిలిచి కూర్చోబెట్టి స్క్రిప్ట్ చదివించే వారు. రేపు ఏ సీన్లు చేయాలి? స్క్రిప్ట్ ఏంటి? అడిగేవారు. అదే రజనీకాంత్ సర్ దగ్గరికి వెళ్తే, షాట్ టైమ్ లో చూద్దాంలే అని చెప్పేవారు” అని దర్శకుడు వెల్లడించారు. అంతే కాదు, "బిగ్ బి పూర్తి ప్రిపరేషన్‌ తో సెట్‌ కు వస్తారు. షూట్ కి ప్రిపేర్ కాకపోతే అతడు చాలా టెన్షన్ పడుతారు.  అందుకే ఓ రోజు నేను బిగ్ బీ సర్ మేనేజర్ తో తను నన్ను ఎందుకు హింసిస్తున్నారు? అని అడిగాను. ఆయన అంతే, రేపటి షూటింగ్ గురించి ఈ రోజే ఆలోచిస్తారు అని చెప్పారు. దర్శకుడిగా నేను ఈ రోజు షూటింగ్ గురించి టెన్షన్ పడుతాను. కానీ, బిగ్ బీ రేపటి షూటింగ్ గురించి ఆలోచిస్తారు” అని చెప్పుకొచ్చారు. ఇక సెట్స్ లో బిగ్ బీ సన్నివేశాలను త్వరగా కంప్లీట్ చేయాలని రజనీకాంత్ చెప్పేవారని దర్శకుడు వెల్లడించారు. బిగ్ బీకి ఆరోగ్య సమస్యలు ఉన్నకారణంగా ఆయన సన్నివేశాలనే ముందుగా షూట్ చేసే వాళ్లమని చెప్పుకొచ్చారు.

అక్టోబర్ 10న ‘వేట్టయాన్’ విడుదల

TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘వేట్టయాన్’ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.  రజనీకాంత్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ యాక్షన్ డ్రామా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.  ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయ, అభిరామి కీలక పాత్రలు పక్షసిస్తున్నారు. ఈ సినిమాతో అమితాబ్ తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.  రజనీకాంత్,  అమితాబ్ బచ్చన్ 33 సంవత్సరాల తర్వాత ‘వేట్టయాన్’ సినిమా చేస్తున్నారు. వీరిద్దరు కలిసి గతంలో  ‘హమ్’ అనే హిందీ చిత్రంలో నటించారు. ఇక ‘వేట్టయాన్’ సినిమా తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది.

Read Also: ‘వేట్టయన్‌’ స్టోరీలో వేలు పెట్టిన సూపర్ స్టార్ - పట్టుబట్టి మరీ మార్పులు చేయించిన రజనీకాంత్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Embed widget