Samantha: నాగచైతన్య-శోభితా ఎంగేజ్‌మెంట్ - నెట్టింట సమంత రియాక్షన్, హార్ట్ బ్రేకింగ్ అంటూ పోస్ట్...
Samantha: నాగచైతన్య-శోభితా ధూళిపాళ నిశ్చితార్థం విషయం తెలిసిందే. మరోవైపు సమంత ఓ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన పోస్ట్‌కి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ జోడించి బాధను వ్యక్తం చేసింది.
Samantha Shared Heartbreaking Post: అక్కినేని హీరో నాగచైతన్య షాకిచ్చాడు. నటి శోభితా దూళిపాళతో రెండో పెళ్లి రెడీ అయ్యాడు. ఇవాళ(ఆగష్టు 8) ఉదయం సీక్రెట్‌గా శోభితాను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తండ్రి, కింగ్ నాగార్జున అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు నాగ చైతన్య-శోభిత ధూళిపాళకు ఎంగేజ్‌మెంట్ ఫోటోలు కూడా షేర్ చేశాడు. దీంతో ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే చై శోభితాను పెళ్లి చేసుకోవడాన్ని చై-సామ్ ఫ్యాన్స్ జీర్ణించుకోవడం. ఈ ప్రకటనతో వారు కాస్తా డిసప్పాయింట్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే చై నిశ్చితార్థం వార్త బయటకు రావడంతో అంతా సమంత రియాక్షన్ కోసం ఎదురచూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశం అయ్యింది. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో సామ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అయితే ఇది చూసి తన మాజీ భర్త ఎంగేజ్‌మెంట్‌పై ఇన్‌డైరెక్టర్‌గా తన బాధను వ్యక్తం చేసిందా.. అని అభిప్రాయపడుతున్నారు. ఇంతక సమంత ఏం పోస్ట్ చేసిందంటే.. పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ పోగట్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అధిక బరువు వల్ల ఆమెను ఫైనల్ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో వినేశ్ ఫోగట్ రెజ్లింగ్‌కి రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ ప్రకటన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక తనకు ఇక పోరాడే శక్తి లేదని, అందుకే రిటైర్‌మెంట్ తీసుకుంటున్నానంటూ భావోద్వేగానికి లోనైంది.
"మా.. రెజ్లింగ్ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీ కల, నా ధైర్యం రెండు విచ్చినమైయ్యాయి. ఇక పోరాడే శక్తి కుడా లేదు. గుడ్‌బై రెజ్లింగ్ 2001-2024" అంటూ ఆమె పోస్ట్ చేసింది. వినేశ్ ఫోగట్ పోస్ట్‌నే సమంత తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేసింది. వినేశ్ ఫోగట్ రిటైర్‌మెంట్ ప్రకటించిందంటూ సామ్ పేర్కొంది. అయితే ఈ పోస్ట్ వెనక సమంత అంతరంగంలో మరోకటి ఉందని, అదే తన మాజీ భర్త నిశ్చితార్థం విషయమై ఉంటుందని సామ్ పోస్ట్‌ని, చై ఎంగేజ్‌మెంట్‌కి లింక్ చేస్తున్నారు. కాగా విడాకులు తర్వాత సమంత తరచూ భావోద్వేగానికి లోనవుతుంది. ప్రతి ఈవెంట్‌లోనూ ఆమె కంటతడి పెట్టుకుంటుంది. అంతేకాదు పోస్ట్‌ల ద్వారా తన ఒంటరితనం గురించి పరోక్షంగా చెబుతూ వస్తోంది.
ఈ క్రమంలో ఇలా నాగచైతన్య - శోభితాతో పెళ్లి సిద్ధమవడం నిజంగా సామ్ బాధించే విషయమే అవుతుంది. ఈ మూమెంట్ ఆమెకు హార్ట్ బ్రేకింగ్ అనే చెప్పాలి. కాగా ఏం మాయ చేశావే సినిమాతో నాగచైతన్య-సమంతలు ప్రేమలు పడ్డారు. దాదాపు పదేళ్ల డేటింగ్ తర్వాత వీరిద్దరు 2017లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు నాలుగేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడెన్‌గా విడాకుల ప్రకటన ఇచ్చింది. 2021 అక్టోబర్ 2న చై-సామ్‌లు విడిపోయామంటూ తమ విడాకులు ప్రకటనను అధికారికంగా వెల్లడించారు. టాలీవుడ్ క్యూట్ కపుల్లో ఒకరైన ఈ జంట విడిపోవడాన్ని ఇప్పటికి వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ వీరిద్దరు కలుస్తారేమో అని ఎదురుచూస్తున్న అభిమానులకు నాగచైతన్య-శోభితాల నిశ్చితార్థం వార్త షాకిచ్చిందనే చెప్పాలి.
Also Read: శోభితతో నాగ చైతన్య పెళ్లి కన్ఫర్మ్ చేసిన నాగార్జున - ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వచ్చేశాయ్