అన్వేషించండి

Naga Chaitanya Shobitha Engagement: శోభితతో నాగ చైతన్య పెళ్లి కన్ఫర్మ్ చేసిన నాగార్జున - ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వచ్చేశాయ్

Naga Chaitanya Shobitha Engagement Photos: అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ విషయాన్ని కింగ్ నాగార్జున కన్ఫర్మ్ చేశారు. ఫోటోలు కూడా షేర్ చేశారు.

Akkineni Nagarjuna shared first photo of Naga Chaitanya and Sobhita Dhulipala engagement: అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అక్కినేని వారింట నేడు వాళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను చైతూ తండ్రి, కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమారుడికి నిశ్చితార్థం జరిగిన విషయం వెల్లడించడమే కాదు... శోభితా ధూళిపాళను తమ కుటుంబంలోకి స్వాగతించారు నాగార్జున.

Also Read: డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రిపోర్ట్... పూరి జగన్నాథ్ ఈజ్ బ్యాక్... ఆడియన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కన్ఫర్మ్!

సాంప్రదాయ దుస్తుల్లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ జంట చూడముచ్చటగా ఉందని అభిమానులు, ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ''ఈ రోజు ఉదయం 9.42 గంటలకు మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభితా ధూళిపాళతో జరిగిన విషయం మీ అందరితో (అభిమానులు, ప్రేక్షకులు) పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. శోభితను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకు శుభాకాంక్షలు. జీవితం అంతా ప్రేమ, సంతోషంతో ఉండాలని ఆశీర్వదిస్తున్నా'' అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో నాగార్జున పేర్కొన్నారు. ఇవాళ ఆగస్టు 8. అంటే... ఎనిమిదో నెలలో ఎనిమిదో  రోజు. 2024లో అన్ని సంఖ్యలను కలిపితే ఎనిమిది వస్తుంది. ఈ సంఖ్యలను ఉద్దేశిస్తూ... ''8.8.8 అనంతమైన ప్రేమకు ఇది ప్రారంభం'' అని నాగార్జున వివరించారు.


అక్కినేని నాగ చైతన్యకు 2017లో సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)తో వివాహం జరిగింది. 'ఏం మాయ చేసావె' సమయంలో వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. అయితే... 2021లో ఆ జంట విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది. సమంత నుంచి వేరు పడిన తర్వాత 'గూఢచారి', 'మేజర్' సినిమాల్లో నటించిన శోభితా ధూళిపాళకు నాగ చైతన్య దగ్గర అయ్యారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రేమ బంధాన్ని నేడు నిశ్చితార్థంతో అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు.

శోభిత తెలుగు అమ్మాయే. అయితే.... హిందీ సినిమా 'రమణ్ రాఘవ్ 2.0'తో హీరోయిన్ కెరీర్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత తెలుగుకు వచ్చారు. ఇటీవల హాలీవుడ్ సినిమా దేవ్ పటేల్ 'మంకీ మ్యాన్'లో కూడా నటించారు. 

Also Readకేజీఎఫ్2 విడుదలైన 847 రోజులకు... కొత్త సినిమా టాక్సిక్ షూట్ స్టార్ట్ చేసిన రాకింగ్ స్టార్ యశ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget