Double Ismart Censor Review: డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రిపోర్ట్... పూరి ఈజ్ బ్యాక్, ఆడియన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కన్ఫర్మ్!
Double Ismart First Review: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా 'డబుల్ ఇస్మార్ట్' సెన్సార్ పూర్తైంది. మరి, సినిమా చూసిన మెంబర్స్ ఏమన్నారో తెలుసా?
Puri Jagannath's Double Ismart Movie First Review: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కమర్షియల్ పరంగా కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. హీరోలకు కొత్త మేకోవర్ ఇవ్వడంలో, మాస్ ఇమేజ్ తీసుకు రావడంలో పూరి ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అందుకే, 'డబుల్ ఇస్మార్ట్'కు సూపర్ బజ్ వచ్చింది.
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో రామ్ పోతినేని (Ram Pothineni)ని ఉస్తాద్ చేశారు పూరి జగన్నాథ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్ కావడం, కొన్ని రోజుల క్రితం విడుదలైన 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ మాసీగా, ప్రేక్షకులు కోరుకునే అంశాలతో ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తుందీ సినిమా. ఆల్రెడీ సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ నుంచి 'డబుల్ ఇస్మార్ట్'కు సూపర్బ్ పాజిటివ్ రివ్యూ వచ్చినట్టు తెలిసింది.
పూరి జగన్నాథ్ ఈజ్ బ్యాక్!
Double Ismart censor talk: 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ చూస్తే... ఇస్మార్ట్ శంకర్ స్వాగ్ కంటిన్యూ అయ్యింది. డబుల్ డోస్ ఉంటుందని అర్థం అయ్యింది. 'ఇస్మార్ట్ శంకర్' ఎలా ఉంటుందో, రామ్ క్యారెక్టరైజేషన్ ఏమిటో అనేది ప్రేక్షకులకు తెలుసు. ఆల్రెడీ ఓ అంచనా ఉంటుంది. అంతకు మించి అనేలా ఆ క్యారెక్టర్‌ను ప్రజెంట్ చేశారట పూరి.
తుపాకీ నుంచి స్పీడుగా దూసుకు వచ్చిన తూటాలు లాంటి డైలాగులు రాయడం పూరి జగన్నాథ్ స్టైల్. 'డబుల్ ఇస్మార్ట్' చూస్తే ఆ పెన్ పవర్ తగ్గలేదని, పూరి ఈజ్ బ్యాక్ అని ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ అంటారని సెన్సార్ రిపోర్ట్. ఒక్క డైలాగుల్లో మాత్రమే కాదు... దర్శకత్వంలో కూడా పూరి జగన్నాథ్ మార్క్ ప్రతి ఫ్రేములో స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు.
ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపరంతే!
ఇంటర్వెల్ వచ్చేసరికి ప్రేక్షకులకు పైసా వసూల్ ఫీలింగ్ ఇస్తుందట ఈ 'డబుల్ ఇస్మార్ట్'. పూరి జగన్నాథ్ ఆ రేంజ్‌లో ఇంటర్వెల్ బాంగ్ డిజైన్ చేశారట. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ప్రేక్షకులకు శాటిస్‌ఫ్యాక్షన్ ఇవ్వడమే కాదు... ఎప్పటికీ గుర్తు ఉండేలా ఉంటుందని తెలిసింది.
Double Ismart Run Time: 'డబుల్ ఇస్మార్ట్' రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు. రేసీ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా సినిమా ముందుకు వెళుతుందని సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్. కమర్షియల్ ప్యాకేజ్ ఫిల్మ్ అయినప్పటికీ... మాస్ అప్పీల్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులు, కావాల్సినంత వినోదానికి ఎటువంటి లోటు లేదని తెలిసింది.
Also Read: కేజీఎఫ్2 విడుదలైన 847 రోజులకు... కొత్త సినిమా టాక్సిక్ షూట్ స్టార్ట్ చేసిన రాకింగ్ స్టార్ యశ్!
రామ్ పెర్ఫార్మన్స్, కావ్య థాపర్ గ్లామర్ హైలైట్!
పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో హీరో ఉస్తాద్ రామ్ పోతినేని పెర్ఫార్మన్స్ సైతం హైలైట్ అవుతుందని సమాచారం అందింది. 'ఇస్మార్ట్ శంకర్' క్యారెక్టర్ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు రామ్ గుర్తుకు వస్తారు. ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఇంకొన్నాళ్లు గుర్తు ఉండేలా రామ్ నటించారట. సంజయ్ దత్ నటన సైతం రిజిస్టర్ అవుతుందని చెప్పారు. ఆల్రెడీ విడుదలైన పాటల్లో కావ్య థాపర్ గ్లామర్ హైలైట్ అయ్యింది. సినిమాలో గ్లామర్ షోకు మాత్రమే పరిమితం కాకుండా ఆమెకు మంచి క్యారెక్టర్ లభించిందట. ముఖ్యంగా రామ్, కావ్య మధ్య రొమాంటిక్ సీన్స్ యువతరం ప్రేక్షకులకు బాగా నచ్చేలా తీశారట పూరి.
'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'హనుమాన్' ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది.
Also Read: జాతి రత్నాలు దర్శకుడితో విశ్వక్ సేన్ సినిమా - అఫీషియల్ గురూ, బ్యానర్ ఏదో తెలుసా?