Samantha Second Marriage : సమంత రెండో పెళ్లి రూమర్స్! - రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్... ఆ వార్తల్లో అసలు నిజం ఏంటంటే?
Samantha Raj Nidimoru : హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం వేళ ఆయన మాజీ భార్య చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వీరి పెళ్లి వార్తలు నిజమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Samantha Raj Nidimoru Second Marriage News Viral : సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటే పోస్ట్ వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనేదే దాని సారాంశం. ఈ ప్రచారం ఊపందుకున్న వేళ రాజ్ మాజీ భార్య చేసిన ఇన్ స్టా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
స్మాల్ నోట్... బిగ్ ఎఫెక్ట్
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లిపై ప్రచారం జరుగుతోన్న వేళ రాజ్ మాజీ భార్య శ్యామాలీ చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఓ చిన్న నోట్ రాశారు. 'తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు' అంటూ పోస్ట్ చేయడంతో వారిద్దరి పెళ్లి నిజమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో సోమవారం సమంత, రాజ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా... శ్యామాలి పెట్టిన పోస్ట్‌తో అది నిజమేనా? అంటూ చర్చ సాగుతోంది. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో సమంత తరచూ పాల్గొంటుంది. టైం ఉన్నప్పుడల్లా ఆమె ఈ ఫౌండేషన్‌కు వెళ్తారు. ఈ ప్లేస్‌తో సమంతకు ప్రత్యేక అనుబంధం ఉండడంతో ఇక్కడే పెళ్లి చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
రాజ్ నిడిమోరు, శ్యామాలిదే 2015లో పెళ్లి చేసుకుని... కొంతకాలం తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో 2022లో డివోర్స్ తీసుకున్నారు. అటు సమంత, నాగచైతన్యల ప్రేమ వివాహం 2017 అక్టోబరులో జరిగింది. ఆ తర్వాత 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ సీజన్ 2లో సమంత నటించగా... దీనికి రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. చైతో సమంత విడాకుల తర్వాత ఇద్దరూ పలు సందర్భాల్లో ఈవెంట్లు, ట్రిప్పులు, రెస్టారెంట్లకు కలిసే వెళ్లారు. 'శుభం' సక్సెస్ మీట్‌లోనూ రాజ్ సందడి చేశారు. దీంతో ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అయ్యారు. సమంత రాజ్‌ను హగ్ చేసుకుని ఫోటోలు దిగారు. దీంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. తాజాగా, సోమవారం ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.






















