అన్వేషించండి

HBD Samantha Ruth Prabhu: ఫ్యాన్స్‌కు సమంత బర్త్ డే సర్‌ప్రైజ్: అప్‌కమింగ్ మూవీ పోస్టర్ రిలీజ్ - హౌజ్ వైఫ్ పాత్రలో వైల్డ్​గా కనిపిస్తున్న సామ్

Happy Birthday Samantha Ruth Prabhu: తన పుట్టినరోజున ఫ్యాన్స్‌కు షాకిచ్చింది సమంత. తన అప్‌కమింగ్ మూవీ నుంచి పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో హౌజ్ వైఫ్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Happy Birthday Samantha Ruth Prabhu: ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా మొత్తం తన బర్త్ డే విషెస్‌తో నింపేశారు. కానీ ఎవరూ తన అప్‌కమింగ్ మూవీస్ నుంచి అప్డేట్ మాత్రం ఆశించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సమంత చేతిలో పెద్దగా సినిమాలు లేవని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఊహించని విధంగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇస్తూ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది సామ్. సమంత ఇలాంటి ఒక అప్డేట్ ఇస్తుందని ఎవరూ ఊహించకపోవడంతో ప్రేక్షకులు సైతం ఈ పోస్టర్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. పోస్టర్‌తో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేసింది సమంత.

హౌజ్ వైఫ్‌గా..

‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌తో చీర కట్టుకొని, గన్ పట్టుకొని చాలా అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తోంది సమంత. అయితే ఈ పోస్టర్ సినిమాకు సంబంధించిందా? వెబ్ సిరీస్‌కు సంబంధించిందా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్‌లో మరో విశేషం ఏంటంటే దీనిని సమంత తన సొంత బ్యానర్ అయిన త్రలాలా మూవీ పిక్చర్స్‌ ద్వారా నిర్మిస్తోంది. ‘బంగారం’ పోస్టర్‌ను బట్టి చూస్తే ఇందులో సమంత ఒక హౌజ్ వైఫ్ అని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ఇది ఒక హౌజ్ వైఫ్ కథ అని, లేడీ ఓరియెంటెడ్ చిత్రమని అర్థమవుతోంది. ఇక ఇలాంటి ఒక ఆసక్తికర పోస్టర్ బయటికి రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడు బయటికొస్తాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇంట్రెస్టింగ్ క్యాప్షన్..

‘మెరిసిందల్లా బంగారం కాదు’ అంటూ ‘బంగారం’ మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జతచేసింది సామ్. దాంతో పాటు ‘ఏదో జరగబోతుంది’ అంటూ నవ్వుతున్న ఇమోజీ కూడా జతచేసింది. సమంత పుట్టినరోజు అయినా కూడా తన నుండి ఎలాంటి అప్డేట్స్‌ను ఆశించని ఫ్యాన్స్.. ఈ పోస్టర్‌ను చూసి సామ్ ఇలా సస్పెన్స్‌లో పడేసింది ఏంటి అని చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్‌ విషయంలో సామ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మొత్తానికి సమంతను మళ్లీ వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది చాలా గుడ్ న్యూస్.

ఆ అప్డేట్ లేదు..

సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత తను ఇంకా ఏ కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేదని తెలిసిన విషయమే. ప్రస్తుతం తన చేతిలో ‘సిటాడెల్’ అనే అమెరికన్ వెబ్ సిరీస్‌కు తెలుగు వర్షన్ మాత్రమే ఉంది. దీనికి ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు కొన్నిరోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. ఇక త్వరలోనే ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ ప్రేక్షకుల ముందుకు కూడా రానుందని రివీల్ చేశారు. ఏప్రిల్ 28న సమంత బర్త్ డే కావడంతో ‘సిటాడెల్: హనీ బన్నీ’ నుండే ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఊహించారు ప్రేక్షకులు. కానీ అనూహ్యంగా ‘బంగారం’ అనే అప్డేట్‌తో వచ్చింది సామ్.

Also Read: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget